రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పౌష్టికాహారం లోపం, రక్తహీనత తో బాధపడే వారిని గుర్తించి మెరుగైన సేవలు అందించే సామర్థ్యం పెంచడం కోసం క్షేత్ర స్థాయి లో సర్వే నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్ లో హీమోగ్లోబిన్ రక్త పరీక్ష కేంద్రాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా కె. మాధవీలత రక్త నమూనా ను ఇవ్వడం జరిగింది. రక్త హీనత, పౌష్ఠికాహారం లోపం వల్ల మరణాలు, ఆనారోగ్యంతో బారిన పడిే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కలెక్టర్ కే. మాధవీలత పేర్కొన్నారు. ఆ దిశలో వారిలోని అనారోగ్య లక్షణాలు గుర్తించడం లో భాగంగా రక్తం లో హేమోగ్లోబిన్ శాతం పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కలెక్టరేట్ లో , వివిధ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు పరీక్షలు నిర్వహించినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా కూడా ఈ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని ఆమె అన్నారు. జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, జిల్లా రెవెన్యూ అధికారి జీ. నరసింహులు తో పాటుగా ఇతర అధికారులు , సిబ్బంది కి కూడా హేమో గ్లోబిన్ రక్త పరీక్షలు నిర్వహించారు.
Prajavartha Online Telugu News