Breaking News

రాష్ట్రంలో ఉన్నత విద్యను రక్షించాలి : ఏఐఎస్ఏ డిమాండ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ఉన్నత విద్యను రక్షించాలని ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులందరికీ జగనన్న విద్యా దీవెన పూర్తిగా ఒకే సమయానికి కళాశాలకే చెల్లించాలని ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ (ఐసా) ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం గాంధీ నగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించడం జరిగింది .సమావేశానికి వివిధ విద్యార్థి నాయకులు పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర అధ్యక్షులు వేమన మాట్లాడుతూ అధికారం లోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో విద్య వ్యవస్థను ప్రక్షాళన చేస్తానని అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి రోజురోజుకీ రాష్ట్రంలో ఉన్నత విద్య విద్యార్థులకు దూరం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నిజానిజాలు గుర్తించి విద్యార్థులకు విద్యాదీవన ఒకే సమయంలో కళాశాలలు చెల్లించాలని లేనిపక్షంలో రాబోవు కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన ,అన్నారు ఎన్.ఎస్.యు.ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కావాలనే ఒక ప్రణాళిక ప్రకారం రాష్ట్రంలో ఉన్నత విద్యను నశింప చేస్తుంది విద్యార్థుల తల్లిదండ్రుల ఎకౌంట్లో డబ్బులు వేస్తే ఖర్చులకు అయిపోవడం వలన విద్యార్థులు కళాశాలలకు కట్టలేక పోవడం వలన విద్యార్థుల సర్టిఫికెట్లు కాలేజ్ యాజమాన్యాల చేతుల్లో ఉండి పై చదువులు చదువుకోలేకపోతున్నారని అందువలన విద్యార్థి సంఘాలు మొత్తం కలిసి రాష్ట్ర ప్రభుత్వం పై ప్రత్యేక ఉద్యమం చేయవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. రాష్ట్ర అధ్యక్షులు శివరామకృష్ణ ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ తీసుకునే ప్రతి కార్యక్రమంలో ముందుండి పోరాటం నిర్వహిస్తామని ఆయన అన్నారు .ఐసా రాష్ట్ర ఉపాధ్యక్షులు అనిల్ కుమార్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయాలు సమాజంలో ఎంతో ప్రతిష్టాంతకమైనటువంటి పాత్ర పోషిస్తున్నాయని… విశ్వవిద్యాలయాలు అనేక వివాదాలతో, సమస్యలతో ముఖ్యంగా విశ్వవిద్యాలయాల్లో రాజకీయ వేదికలుగా అక్రమాలకు నిలయంగా మారుతున్నాయి అన్నారు . దీంతో రాష్ట్రంలోని విశ్వవిద్యాలయంలో నియమించేపాలకమండలి సభ్యులతో పాటు వైస్ చాన్సులర్స్ నియామకాలు వరకు ఎన్నో ఆరోపణలకు కారణం అవుతున్నాయ వైయస్ఆర్ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి పాలకమండలి సభ్యుల విషయంలో అనేక అవకతవకలు అర్హతలు లేని సభ్యుల నియమిస్తూరని రాజకీయ నాయకులు బంధువులకు విశ్వవిద్యాలయంలో పాలకమండలి సభ్యులుగా నియమించడం జరుగుతుందని ఆరోపించారు. విశ్వవిద్యాలయాల్లో పూర్తిస్థాయిలో ప్రవేశాలు పడిపోవడం గమనించవచ్చు ప్రవేశాల కొరకు వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చేవి అన్నారు.వీటన్నిటిపై సమగ్ర చర్చ జరిపి రాష్ట్రంలోనూ ఉన్నత విద్యను కాపాడాలని ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగిందని అన్నారు . జిల్లా కార్యదర్శి గరికే అఖిల్ ప్రసన్న, విద్యార్థి నాయకులు శ్రీను శివ మహేష్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *