
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నలంద డిగ్రీకాలేజ్ ఫ్రెషర్స్ డే సంబరాలు స్థానిక తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కాలేజ్ ప్రిన్సిపాల్ అనురాధ మాట్లాడుతూ జూనియర్స్ ని సీనియర్స్ అనే బేధం లేకుండా అందరిని కలపడమే ఫ్రెషర్స్ డే ఉద్దేశమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు పాల్గొన్నారు. విద్యార్థులు ఉద్దేశించి చక్కని సందేశం ఇచ్చారని ఆమె అన్నారు. ఏపీ స్టేట్అయ్యర్ ఎడ్యుకేషన్ వైస్ చైర్మన్ రామ్మోహన్ రావు పాల్గొని విద్యార్థి విద్యార్థులు ఎలా నడుచుకోవాలి తెలియజేశారు అని అన్నారు. క్లాసికల్ డాన్స్, వెస్ట్రన్ డాన్స్, ఫ్యాషన్ షోలు, డాన్సులు ఉదయం నుండి సాయంత్రం వరకు జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు కాలేజ్ లెక్చరర్స్ నలంద కాలేజీ సిబ్బంది తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం
-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …
Prajavartha Online Telugu News