Breaking News

గాలిబ్ షహీద్ ద‌ర్గాను సంద‌ర్శించిన గిడుగు రుద్రరాజు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నాలుగున్న‌ర శ‌తాబ్ధాల చరిత్ర కలిగిన హజరత్ గాలిబ్ షహీద్ దర్గాను దర్శించుకోవటం పూర్వ‌జ‌న్మ సుకృతం అని ఏపిసీసీ రాష్ట్ర అధ్య‌క్షుడు గిడుగు రుద్ర‌రాజు అన్నారు. శుక్ర‌వారం ఆయ‌న ద‌ర్గాను సంద‌ర్శించి చాదర్ సమర్పించి ప్ర‌త్యేక ప్రార్ధనలు చేశారు. దివంగ‌త ప్రధాని ఇందిరా గాంధీ కుటుంబం కోసం మతగురువులతో ప్రత్యేక ప్రార్ధనలు చేయించారు. అనంతరం మీడియాతో గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మరింత ఉత్సాహంగా ముందుకు సాగాలని రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు ఆయురారోగ్యాలతో వర్ధిలి దేశ ప్రజలకు మరిన్ని సేవలు చేయాలని, రాష్ట్రంలో జగన్ ప్ర‌భుత్వం నుండి ప్రజలకు రక్షించాలని కోరుకున్నారు. మైనార్టీల సంక్షేమం కోసం జగన్ చేసింది శున్యమే అని, ముస్లింలకు ఇచ్చిన వాగ్ధానాలను పూర్తిచేయలేని అసమర్థ ప్రభుత్వం వైసీపీది అని దుయ్యపట్టారు. ముస్లిం మైనార్టీలకు ఇస్లామిక్ బ్యాంకుల‌ను స్థాపించి పేద ముస్లిం మైనార్టీలకు వడ్డీలేని రుణాలు ఇస్తానని నేడు కేంద్రప్రభుత్వం పేద ముస్లింలకు ఇచ్చే స్కాలర్ షిప్‌లు రద్దుచేస్తే మద్దతు తెలిపిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మైనార్టీల సంక్షేమం కోసం ఏమి పాటుపడతాడని విమర్శించారు. అనంతరం సిటికాంగ్రేస్ మైనార్టీ సెల్ ఛైర్మెన్ షేక్ ఖాజా మొహినుద్దీన్ ఆధ్వర్యంలో పలువురు మైనార్టీలు గిడుగు రుద్రరాజుకు సన్మానం చేశారు. కార్యక్రమంలో మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్‌.తులసి రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొలనుకొండ శివాజీ, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ధనేకుల మురళి, కృష్ణాజిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు లామ్ తాంతియా కుమారి, సీనియర్ మైనార్టీ కాంగ్రెస్ నాయకులు బషీర్ అహ్మద్, సిటీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు షేక్ అబ్దుల్ అన్సారీ, హెచ్.ఎస్.బేగ్, ఎండీ గౌస్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మేకల సతీష్, గొరిపర్తి హనుమంతరావు, బూదాల జోసఫ్, మల్లికా రెడ్డి, షేక్ ఖుర్షిదా, షేక్ ఖాజా, డిఎన్‌ఆర్, బాలు, షేక్ అజీస్, రాష్ట్ర ఎన్.ఎస్.యు.ఐ. ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, దర్గా ధర్మకర్తలు, మాజీ కార్పొరేటర్ అబ్దుల్ ఖాదర్, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *