తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఎమ్.ఎల్.సి. ఓటరుజాబితా మరియు ఓటర్ జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ లో తప్పులు జరగకుండా చూడాలని తిరుపతి రెవిన్యూ డివిజనల్ అధికారి కనక నరసారెడ్డి పేర్కొన్నారు. శనివారం తిరుపతి, అర్బన్, రూరల్,చంద్రగిరి, పాకాల మండల తహశీల్దార్ల కార్యాలయాల్లో జరుగుతున్న ఎమ్. ఎల్.సి. ఓటరు జాబితా స్క్రుటీనినీ ఉపకమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి తో కలసి పరిశీలించారు. అనంతరం నవరత్నాలు- పేదలందరికి ఇల్లు కార్యక్రమంలో భాగంగా చంద్రగిరి మండలం రెడ్డి వారి పల్లి గ్రామంలో జరుగుతున్న గృహ నిర్మాణాల పనుల పురోభివృద్ధిని చంద్రగిరి మండల ఎంపీపీ శ్రీ హేమంద్రనాథ్ తో కలిసి పరిశీలించారు. లభ్డిదారులతో మాట్లాడి తొందరగా ఇల్లు నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు చూచించారు. ఆర్డీఓ వెంట తిరుపతి అర్బన్ రూరల్, చంద్రగిరి, పాకాల తహశీల్దార్లు వెంకటరమణ, లోకేశ్వరి,శిరీష, భాగ్యలక్ష్మి, ఎంపీడీఓ, రమేష్ బాబు,గృహ నిర్మాణ శాఖ,ఏ ఇ, యం.ఇ ఓ, తదితరులు ఉన్నారు.
Prajavartha Online Telugu News