Breaking News

“క్లీన్ ఆంధ్రప్రదేశ్” (CLAP) వారోత్సవాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగర పాలక సంస్థ నగర వ్యాప్తంగా చేపట్టిన “క్లీన్ ఆంధ్రప్రదేశ్” (CLAP) వారోత్సవాలు ఈ ఆదివారంతో ముగిశాయి. కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశాల మేరకు నగరంలోని మూడు సర్కిల్స్ నందు ప్రతి సచివాలయ పరిధిలో గల నివాసముల వారికి వారం రోజుల పాటు అవగాహనా కార్యక్రమాలు చేపట్టారు. అయితే ఈ వారోత్సవాల ముగింపు కార్యక్రమము నగరంలోని మూడు సర్కిల్స్ నందు మరింత ప్రత్యేకంగా నిర్వహించారు.

వారోత్సవాలను పురస్కరించుకుని ఈ వారం రోజుల పాటు నగర ప్రజలకు ప్రతి ఇంట్లో తడి చెత్త, పొడి చెత్త, ప్రమాదకర వ్యర్దాలుగా విభజించి విజయవాడ నగర పాలక సంస్ధ చెత్త సేకరణ చేయు సిబ్బందికి అందజేయాలని, ప్లాస్లిక్ కవర్లకు బదులుగా గుడ్డ సంచులు వినియోగించాలని, నగరము నందు బహిరంగ మల మూత్ర విసర్జన జరగకుండా చర్యలు తీసుకోవాలని నగరాన్ని స్వచ్చ విజయవాడగా తీర్చిదిద్దుటకు ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుబ్రముగా ఉంచుకోవాలని, స్వచ్ఛ భారత్ పరిశుభ్రత పోటీలలో విజయవాడ నగరాన్ని మొదటి స్థానములో వుంచుటకు ప్రతిఒక్కరు స్వచ్చందముగా భాగస్వాములు కావాలని అధికారులు మరియు సచివాలయం సిబ్బంది ప్రతి ఇంటికి ప్రజలందరికీ యూజర్ చార్జీలు గురించి అవగాహన కల్పించారు. Slum Area రూ.30, Non Slum Area రూ.120,

దీనిలో భాగంగా ఆదివారం, నగరంలోని మూడు సర్కిల్స్ జోనల్ కమిషనర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక ర్యాలీలు మరియు మానవహారం నిర్వహించారు. సర్కిల్ -1 పంజా సెంటర్ నందు , సర్కిల్ -2 రాఘవయ్య పార్క్ నుండి లెనిన్ సెంటర్ వరకు మరియు సర్కిల్ -3 రామవరప్పాడు రింగ్ నుండి గుణదల మేరీ మాత గుడి వరకు స్వచ్ఛ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. తదుపరి అందరూ మానవహారంగా ఏర్పడి స్వచ్ఛ నగరానికై ప్రతిజ్ఞ చేశారు.

ఈ కార్యక్రమాలలో అదనపు కమీషనర్ (ప్రాజెక్ట్స్) K. V. సత్యవతి, CMOH రత్నావళి, జోనల్ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, హెల్త్ ఆఫీసర్స్, శానిటరీ సూపర్ వైజర్స్ ,సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు మరియు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *