Breaking News

హిమాచల్ ప్రదేశ్ సీఎం కు శుభాకాంక్షలు తెలియజేసిన ఏపిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికలలో హిమాచల్ ప్రదేశ్ లో భారీ విజయంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం పట్ల గిడుగు హర్షం వ్యక్తం చేశారు. ఆమేరకు ఆయన ఈరోజు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వెందర్ సింగ్ సుకు ను మర్యాదపూర్వకంగా న్యూ ఢిల్లీ లో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. త్వరలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రావాలని ముఖ్యమంత్రి సుఖ్వెంధర్ సింగ్ ను గిడుగు ఆహ్వానించారు. తదనంతరం గిడుగు మాట్లాడుతూ సుఖ్వెండర్ సింగ్ తాను అనేక పర్యాయాలు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను కలిసి పనిచేశామని గుర్తుచేశారు. ఆయన ఈ రోజు ఎంతో అత్యున్నతమైన పదవి అధిరోహించటం చాలా ఆనందంగా వున్నదని వెల్లుబుచారు. సింగ్ నేతృత్వంలో హిమాచల్ ప్రదేశ్ అనేక ప్రజాకర్షక విధానాలు అమలవుతాయని అన్నారు. దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ జోడో యాత్ర స్పూర్తితో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు రావటానికి ప్రతి ఒక్కరితో కలిసి ముందుకు వెలతామని గిడుగు తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *