Breaking News

8 వ తరగతి విద్యార్ధులు, టీచర్లకు జిల్లాలో ఉచితంగా ట్యాబ్‌లు వారం రోజుల పాటు పంపిణీ

-విద్యా వ్యవస్థలో వినూత్న మార్పులతో బలోపేతం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం: జిల్లా కలెక్టర్
-అర్హులందరికీ క్రమం తప్పకుండా కుల, మత, పార్టీ వివక్ష లేకుండా, లంచాలకు తావు లేకుండా పారదర్శకంగా పథకాలు అందిస్తున్న మన సి యం: ఎమ్మెల్యే ఆది మూలం

సత్యవేడు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని పేద పిల్లలకు మేనమామలా, కేవలం స్థితిమంతుల పిల్లలకే కాకుండా
ఇంగ్లీష్‌ మీడియం విద్య, క్లాస్‌రూమ్‌లో సబ్జెక్ట్‌ టీచర్‌ కాన్సెప్ట్‌ తో, క్లాస్‌ బయట కూడా 24/7 విద్యార్ధులు సబ్జెక్ట్‌ను నేర్చుకోవడానికి వీలు కల్పిస్తూ వారి భవిష్యత్‌కు బంగారు బాటలు వేస్తూ నేడు 8 వ తరగతి విద్యార్ధులు, టీచర్లకు ఉచితంగా ట్యాబ్‌లు పంపిణీ కార్యక్రమం బాపట్ల జిల్లా చుండూరు మండలం యడ్లపల్లిలో లాంఛనంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించగా తిరుపతి జిల్లా, సత్యవేడు నియోజకవర్గానికి సంబంధించి సత్యవేడు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత బాలుర పాఠశాలలో 8వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ట్యాబ్ ల పంపిణీ, జిల్లా కలెక్టర్ కె. వెంకట రమణారెడ్డి స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తో కలిసి బుధవారం ఉదయం ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో 8 వ తరగతి చదువుతున్న 4,59,564 మంది విద్యార్ధులు, బోధించే 59,176 మంది ఉపాధ్యాయులకు రూ. 778 కోట్ల బైజూస్‌ ప్రీలోడెడ్‌ కంటెంట్‌తో రూ. 686 కోట్ల విలువైన 5,18,740 శామ్‌సంగ్‌ ట్యాబ్‌లు ఉచితంగా పంపిణీ వలన విద్యార్థులకు మొత్తం రూ. 1,466 కోట్ల విలువైన లబ్ధి చేకూరుతొందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజుల పాటు ట్యాబ్ లు అన్ని నియోజక వర్గాలలోని మండలాల పాఠశాలలకు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు.

ఒక్కొక్క ట్యాబ్ రూ. 16,500 కు పైగా మార్కెట్‌ విలువ కలిగినవి దాదాపు రూ. 15,500 విలువ గల కంటెంట్‌తో కలిపి ప్రతి 8 వ తరగతి విద్యార్ధికి సుమారు రూ. 32 వేల లబ్ధి చేకూరుతుందని అన్నారు. ట్యాబ్‌లలో అవాంఛనీయ సైట్లు, యాప్స్‌ను నిరోధించే ప్రత్యేక సాఫ్ట్‌ వేర్, 3 ఏళ్ళ పాటు వ్యారంటీ ఉంటుందని తెలిపారు.

మన జిల్లాలో 8 వ తరగతి కి చెందిన 2593 మంది టీచర్లు, 18723 మంది విద్యార్థులు కలిపి మొత్తం 21316 మందికి రూ. 68.40 కోట్ల విలువైన ట్యాబ్ లు, బైజూస్ కంటెంట్ పంపిణీ చేస్తున్నారని తెలిపారు.

ఈ జూన్‌ కల్లా నాడు – నేడు ఫేజ్‌ 1 లో పూర్తయిన స్కూల్స్‌లోని 6 వ తరగతి పైన ఉన్న క్లాస్‌ రూమ్స్‌లో ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానల్స్‌ (డిజిటల్‌ డిస్‌ప్లే బోర్డుల ద్వారా చదువులు), ఫౌండేషన్, ఫౌండేషన్‌ ప్లస్‌ స్కూళ్ళలో స్మార్ట్‌ టీవీల ఏర్పాటు దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని అన్నారు. విద్య కు ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్ద పీట వేసిందని, నేటి మన ఈ రాష్ట్ర పిల్లలే రేపటి అన్ని రంగాల్లో అన్ని ప్రాంతాల్లో మంచి ఉన్నతమైన స్థాయిలో ఉంటారని ఆకాంక్షిస్తున్నా అని తెలిపారు.

ఎమ్మెల్యే కోనేటి ఆదిములం మాట్లాడుతూ నేడు వై యస్ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ట్యాబ్ లు పంపిణీ చేయడం ఒక మేనమామ గా పిల్లలకు ఎంతో శుభ పరిణామం అని అన్నారు. పేద విద్యార్ధులను మెరుగ్గా తీర్చిదిద్దేలా, డిజిటల్‌ విధానంలో పాఠ్యాంశాలు మరింత సులభంగా అర్ధమయ్యేలా మెరుగైన చదువుల దిశగా ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో 8 వ తరగతిలోకి అడుగుపెట్టిన పిమ్మట ప్రతి విద్యార్ధికి ఇకపై ప్రతి ఏటా బైజూస్‌ కంటెంట్‌తో కూడిన ఉచిత ట్యాబ్‌ల పంపిణీ కి ఆఫ్‌లైన్‌లో కూడా పనిచేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు.

గతంలో ఉన్న ప్రభుత్వాలు విద్యా వ్యవస్థ పై పెద్దగా దృష్టి సారించలేదని, మధ్యాహ్న భోజనం, విద్యా వసతులు, భవనాలు, టాయిలెట్లు బాగుండేవి కాదని నేడు మన రాష్ట్ర ప్రభుత్వం గత మూడున్నర ఏళ్ళలో జగనన్న అమ్మ ఒడి పథకం, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా కానుక, 8వ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయులకు పంపిణీ చేస్తున్న ట్యాబ్ లు, బైజుస్ కంటెంట్, జగనన్న గోరుముద్ద, పాఠశాలల్లో నాడు నేడు, వైయస్సార్‌ సంపూర్ణ పోషణ, స్వేచ్ఛ (శానిటరీ నాప్‌కిన్స్‌) పథకం ఇలా పలు పథకాల కింద మొత్తం సుమారు రూ. 54,910 కోట్లు వెచ్చించడం జరిగిందనీ అన్నారు. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా పాలన సాగిస్తున్నారని అన్నారు.

డైరెక్టర్, ఏపీ పాఠ్య పుస్తకాల సంస్థ రవీంద్ర రెడ్డి మాట్లాడుతూ 4 నుండి 10 వ తరగతి చదువుతున్న 32 లక్షల మంది విద్యార్ధులకు ఒక్కొక్కరికి రూ. 15,500 విలువైన రూ. 4,960 కోట్ల బైజూస్‌ కంటెంట్‌ ఉచితంగా అందచేయ బోతున్నారని అన్నారు.

ప్రస్తుతం 8 వ తరగతి చదువుతున్న విద్యార్ధులు 2025 విద్యా సంవత్సరంలో సీబీఎస్‌ఈ విధానంలో ఇంగ్లీష్‌ మీడియంలో 10 వ తరగతి పరీక్ష రాసేలా పిల్లలను ప్రభుత్వం సన్నద్ధం చేస్తున్నదని ఇది గొప్ప శుభ పరిణామం అని అన్నారు.

పేద విద్యార్ధులకు సైతం డిజిటల్‌ విద్యను అందుబాటులోకి తెస్తూ, తరగతి గదుల్లో చెప్పే పాఠాలను ఇళ్ళకు వెళ్ళాక కూడా పిల్లలు మరింత క్షుణ్ణంగా నేర్చుకునేందుకు వీలుగా బైజూస్‌ కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌లు ఉచితంగా పంపిణీ ఇంటర్నెట్‌ సౌకర్యం లేని విద్యార్ధులకు ఆఫ్‌ లైన్‌లో కూడా ఎక్కడైనా, ఎప్పుడైనా 24/7 పాఠ్యాంశాలు అందుబాటులో ఉండేలా, 8,9 తరగతుల కంటెంట్‌ మెమరీ కార్డు ద్వారా ట్యాబ్‌లలో ప్రీలోడ్‌ బైజూస్‌ ప్రీమియం యాప్‌ ద్వారా విద్యార్ధులకు మాథ్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, హిస్టరీ, జియాలజీ, సివిక్స్‌ సబ్జెక్ట్‌లలో అభ్యసన సులువుగా ఉండేలా ఇంగ్లీష్, తెలుగు భాషల్లో ఉచిత ఈ–కంటెంట్‌ ప్రతి చాప్టర్‌ను కాన్సెప్ట్‌లుగా విభజించి 67 చాప్టర్లు, 472 కాన్సెప్ట్‌లపై 300 వీడియోలు, 168 సాల్వ్‌డ్‌ క్వశ్చన్‌ బ్యాంక్‌లు అందుబాటులో ఉంటాయని అన్నారు.

పిల్లలకు సులభంగా పాఠ్యాంశాలు అర్ధమయ్యేలా టెక్ట్స్‌ రూపంలో మాత్రమే కాకుండా మంచి చిత్రాలు, వీడియో, ఆడియో, త్రీ డైమెన్షన్‌ (త్రీడీ) ఫార్ములాలో యానిమేషన్లతో రూపొందించిన కంటెంట్‌ తో కూడినదని, పిల్లలు తమ స్ధాయిని స్వయంగా అంచనా వేసుకునేలా అసెస్‌మెంట్‌ విధానం, ప్రతి చాప్టర్‌ తర్వాత 40–50 ప్రశ్నలు, వివిధ గ్రేడ్లలో మాక్‌ పరీక్షలు బాగా దోహద పడుతుందని అన్నారు.

అనంతరం జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే లు విద్యార్థులకు ట్యాబ్స్ ను పంపిణీ చేశారు, రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి 50 వ జన్మదినం సందర్భంగా విద్యార్థులతో కలసి కేక్ కట్ చేసి విద్యార్థుల కు పంచి పెట్టారు.తర్వాత పాఠశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ అధికారి శేఖర్, ఏ ఎం ఓ శివ శంకర్, ప్లానింగ్ కో ఆర్డినేటర్ రామచంద్ర రెడ్డి, ఎంపీపీ ప్రతిమ, జడ్పీటీసీ విజయలక్ష్మి,సర్పంచ్ మంజిల, ఎంపిడిఓ బాలగనేష్, తహశీల్దార్ సుబ్రహ్మణ్యం, ఎం ఈ ఓ రవి, పాఠశాల, ఉపాద్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *