తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈరోజు తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ యు.శ్రీ హరి జిల్లాలోని పట్టణ ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులు అందరితో డి ఎం హెచ్ ఓ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా ఫోర్త్ వేవ్ ప్రారంభమైందని, ప్రపంచంలోని సుమారు12 దేశాలలో ముఖ్యంగా చైనాలో ఉధృతంగా ఉందని, మనదేశంలో కూడా క్రొత్త కేసులు పుట్టుకొస్తున్నాయని ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించేలా చేయాల్సిన బాధ్యత మనందరికీ వుందని వైద్యులకు తెలియజేశారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి ప్రతిరోజు మూడు VHCలను ఎంచుకుని ప్రతి VHC నుంచి ముగ్గురు కోవిడ్ అనుమానితులను గుర్తించి ర్యాపిడ్ కిట్స్ తో పరీక్షలు ఈనాటి నుంచే చేయాలని పేర్కొన్నారు. యుక్త వయస్సు బాలబాలికలు10-19 సం౹౹లు గల వారు,గర్భవతులు, అంగన్వాడీ కేంద్రంలోనూ రక్తహీనత పరీక్షలు చేసి అవసరమైన వారికి IFA మాత్రలు ఇవ్వాలని సూచించారు. EDD కి పదిరోజుల ముందు నుంచి గర్భవతుల పరిస్థితిని ఫోన్ ద్వారా తెలుసుకుని ఆసుపత్రిలో ప్రసవించేలా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. రక్తహీనత గల గర్భవతులుంటే వారికి అవసరమైతే ఐరన్ సూక్రోస్ వంటివి డాక్టర్ పర్యవేక్షణలో ఇప్పించాలని మరియుఖ హైరిస్క్ గర్భవతుల విషయంలో మరింత జాగ్రత్తగా వారం రోజులు ముందే ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించాలని సూచించారు. ఇలాంటి కేసుల వివరాలు జిల్లా కేంద్రంలోని హైరిస్క్ టీమ్ కు తెలియజేయాలని పేర్కొన్నారు. జిల్లాలో డిసెంబర్ 17వ తేదీ నుంచి జీరో మెటర్నల్ డెత్ వీక్ అమలులో వుందని, ఈవారంలో ఏ ఒక్క మాతృ మరణం కూడా జరగకుండా ఆరోగ్య సేవలు అందాలని పేర్కొన్నారు. ANM లేని చోట ప్రక్క సచివాలయం ANM లేద MLHPకు గాని, ఆరోగ్య పర్యవేక్షకురాలుకి గాని బాధ్యతలు అప్పగించాల సూచించారు. RCH,NCDCD, LCDC,FLC,AMB,ABHA Cards కార్యక్రమాలలో, రొటీన్ ఇమ్మ్యూనైజేషన్, MR1,MR2 మరియు జ్వరంతో కూడిన దద్దుర్లు గల కేసులు గుర్తించి వాటి వివరాలు జిల్లా వ్యాధి నిరోధక టీకాల కార్యాలయంలో అందేలా చేయాలన్నారు. ఆశాకార్యకర్తలందరికీ గర్భనిర్ధారణ పరీక్షల కిట్స్ అందించాలని పేర్కొన్నారు. పట్టణ ఆరోగ్య కేంద్రాలు ప్రభుత్వం చేపడుతున్న ఆరోగ్య కార్యక్రమాలలో నిర్ధేశించిన అంచనాలు అందుకోవడంలో చాలా వెనుకబడి వుండటానికి వీలు లేదని హెచ్చరించారు. ప్రతి సచివాలయంలో జరుగుతున్న వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాలను రాష్ట్ర స్థాయి అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేయడానికి వస్తారని ఎటువంటి అవకతవకలున్నా ఇబ్బందులు పడతారని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో DIO డాక్టర్ శాంతకుమారి,Dy.DMHO సుధారాణి,DPMO డాక్టర్ శ్రీనివాస రావు, వైద్యులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News