Breaking News

ఘనంగా క్రిస్మస్‌, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి జన్మదినం వేడుకలు


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
క్రిస్మస్‌, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి జన్మదినం సందర్భాలను పురస్కరించుకుని విక్టరీ బాప్టిస్ట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. బుధవారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన వేడుకలలో పెరికె ఫౌండేషన్‌ చైర్మన్‌, సోషల్‌వర్కర్‌, హైకోర్ట్‌ న్యాయవాది పెరికె వరప్రసాదరావు ఆధ్వర్యంలో కళాక్షేత్రం ప్రాంగణంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ పాస్టర్స్‌ ప్రొటెక్షన్‌ సంస్థ సలహాదారు వైఎస్‌ థామస్‌ మాట్లాడుతూ క్రైస్తవుల సమస్యలపై ప్రభుత్వం స్పందిస్తున్న తీరు బాగుందన్నారు. గుడ్‌ గవర్నెన్స్‌లో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం మంచి మార్కులు సాధించిందన్నారు. ప్రజా సంక్షేమానికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీసుకునే చారిత్రాత్మకమైన నిర్ణయాలు, విప్లవాత్మకమైన మార్పులతో నవశకానికి శ్రీకారం చుట్టారన్నారు. కార్యక్రమ నిర్వాహకులు విక్టరీ బాప్టిస్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, అంతర్జాతీయ సువార్తికులు డాక్టర్‌ పండు మద్దాల మాట్లాడుతూ విక్టరీ బాప్టిస్ట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జనవరి 8, 9, 10 తేదీలలో విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని బసవపున్నయ్య స్టేడియంలో క్రీస్తు సువార్త మహాసభలను నిర్వహించనున్నట్లు తెలిపారు. పెరికె ఫౌండేషన్‌ చైర్మన్‌ పెరికె వరప్రసాదరావు మాట్లాడుతూ భవిష్యత్‌ మరిన్ని సేవా కార్యక్రమాలు చేసే ఆలోచనలో వున్నామని, తమకు చేతనైనంతలో దైవ సేవా కార్యక్రమాలతోపాటు సామాజిక సేవాదృక్పదంతో పలు సేవా కార్యక్రమాలు చేశామని ఇప్పుడు చేస్తున్నామన్నారు. దానిలో భాగంలో వేడుకలతోపాటు ఉచిత మెడికల్‌ క్యాంప్‌ను వస్త్రాలు పంపిణీ నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం సీఎం జగన్‌మోహన్‌ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రెవరెండ్‌ శ్యాంబాబు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో రెవరెండ్‌ జీవన్‌కుమార్‌, చోరగుడి ఇజ్రాయేల్‌, పలువురు దైవజనులు, సంఘస్థులు పాల్గొన్నారు.

 

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *