విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సిటిజన్ పర్సెప్షన్ సర్వే లో భాగంగా గురువారం పోలీస్ కమీషనర్ కాంతి రానా టాటా I.P.S కలిసి వారిని కూడా ఈ సర్వే లో భాగం చేసేందుకు వారిని విజయవాడ నగర పాలక సంస్థ సిబ్బంది కలవడం జరిగింది. పోలీస్ కమీషనర్ కాంతి రానా ఆధ్వర్యంలో సిటిజన్ పర్సెప్షన్ సర్వే లో పాల్గొనమని అధికారులకు పిలుపునిచ్చారు. ఈ సర్వే లో అందరూ పాల్గొని మన నగర వైభవాన్ని దేశ వ్యాప్తంగా చాటేందుకు సహకరించాలని కాంతి రానా విన్నవించారు. అలాగే కమీషనర్ కార్యాలయంలో వున్న అధికారులు, ఉద్యోగులు కూడా ఈ సర్వే లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ కాంతి రానా టాటా, IPS తో పాటు డీసీపీ సత్తి బాబు కూడా పాల్గొన్నారు. సర్వే డిసెంబర్ 23న ముగియనున్నందున ఇప్పటివరకు 2 లక్షలకు పైగా సర్వే చేయడమైనది. ఇందులో భాగంగా ప్రజలను ఈ సర్వేలో పాల్గొనవలసిందని నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ కోరడమైనది. eol2022.org వెబ్సైట్లో మన సిటీ కోడ్ 802969 ఇచ్చి కొన్ని సాధారణ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం ద్వారా మన నగర పక్షాన నిలబడాలని ప్రతి నగర పౌరుడిని విజయవాడ నగర పాలక సంస్థ కోరుకుంటుంది.
Prajavartha Online Telugu News