-రైతు మిత్రుడు -పవన్ కళ్యాణ్
-రైతుల సమస్యలపై నిత్యం పోరాడుతూ వారికి అండగా నిలబడుతున్న పవన్ కళ్యాణ్ ని రైతుబంధుగా కొనయాడుతున్న రాష్ట్ర రైతాంగం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రైతు లేనిదే మనిషి లేడు దేశానికి రైతే వెన్నుముక .రైతు కష్టపడితే తప్ప మన కంచంలోకి అన్నం రాదు. మానవాళిని బ్రతికించే వృత్తిని ఎన్నుకున్న రైతన్నలకు జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ తెలియజేశారు. జాతీయ రైతు దినోత్సవం పురస్కరించుకొని అప్పారావుపేటలో పోతిన కృష్ణ బాబు పర్యవేక్షణలో పోతిన దుర్గారావు వ్యవసాయ క్షేత్రంలో జాతీయ రైతు దినోత్సవాన్ని స్థానిక రైతులకు పచ్చ కండువాలు కప్పి చిరు సత్కారం చేసిన జనసేన పార్టీ విజయవాడ నగర నాయకులు డివిజన్ అధ్యక్షులు వీర మహిళలు మరియు జనసైనికులు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ రైతుల విషయంలో పవన్ కళ్యాణ్ చరణ్ సింగ్ ని ఆదర్శంగా తీసుకొని అన్నదాతల మేలు కోసం నిరంతరం కృషి చేస్తున్నారని, అందుకే పవన్ కళ్యాణ్ ని AP లో రైతుబంధుగా,3000 కౌలు రైతులకు ఆర్థిక భరోసా అందిస్తూ వారికి జీవితంపై నమ్మకం కలిగిస్తున్న పవన్ కళ్యాణ్ ని కౌలు రైతుల కాపరి గా కొనియాడుతున్నారని, రైతు భరోసా పథకం ఇచ్చేందుకు రైతుల మధ్య కులాల చిచ్చుపెట్టిన రైతు ద్రోహి CM జగనని కులం మతం ప్రాంతం చూడకుండా కౌలు రైతుల కుటుంబాలను ఆదుకుంటున్న రైతు మిత్రుడు పవన్ కళ్యాణ్ అని రాష్ట్ర రైతాంగం కొనియాడుతున్నారన్నారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి రోజురోజుకీ దిగజారిపోతుందని పరిస్థితుల అధ్వానంగా ఉన్నాయని. cm జగన్ ది ఐరన్ లెగ్ పాలన గనుకనే చేతి వరకు వచ్చిన పంట నోటి వరకు రావడం లేదని, అకాల వర్షాలు తుఫాను వలన రైతాంగం నష్టపోతుందని, ఉచిత విద్యుత్ కు మంగళం పాడి మోటార్లకు మీటర్లు బిగించి ఒక దుర్మార్గమైన నిర్ణయం తీసుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు జనసైనికులతో పాటు స్థానిక రైతులు ప్రజలు పాల్గొన్నారు. స్థానిక రైతులు వారు పడుతున్న అనేక ఇబ్బందులను తెలియజేసారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు షేక్ అమీర్ భాష, కొరగంజి వెంకటరమణ, మల్లెపు విజయలక్ష్మి, పొట్లూరి శ్రీనివాసరావు, రెడ్డిపల్లి గంగాధర్ రావు ,బొమ్మ రాంబాబు, ఆకుల శంకర్, తమ్మిన లీలా కరుణాకర్ నగర అధికార ప్రతినిధి ముద్దాన స్టాలిన్ శంకర్, ఆలమూరు శ్రీదేవి సయ్యద్ ముబీనా, పాల రజిని, సెంట్రల్ నియోజకవర్గ నాయకులు బొలిశెట్టి వంశీకృష్ణ, నాగేష్ ,రుద్ర పవన్ కళ్యాణ్, సోమీ మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News