విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కృష్ణానది వరద ముంపు ప్రాంతావాసులకు ఊరట కలిగిస్తూ వారి చిరకాల కోరిక అయిన రిటైనింగ్ వాల్ నిర్మించిన ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిదే అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. శుక్రవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 17వ డివిజన్ 80వ సచివాలయం పరిధిలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం ద్వారా వారి కుటుంబాలకు అందుతున్న సంక్షేమ లబ్ధి వివరాల కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ స్వర్గీయ వైయస్ రాజశేఖర రెడ్డి మీద అంతులేని అభిమానం చూపించే ఈ ప్రాంతావాసులు అదే ప్రేమ,అభిమానం నేడు వైయస్ జగన్ మీద చూపిస్తూ పార్టీకి అండగా నిలిచారని, వారు ఏ నమ్మకం అయితే పెట్టుకొన్నారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా అధికారంలోకి రాగానే ఈ ప్రాంత అభివృద్ధి మీద ప్రత్యేక దృష్టి అభివృద్ధి చేయడంతో పాటు, ఇక్కడి ప్రజల చిరకాల వాంఛ అయిన రిటైనింగ్ వాల్ ని కూడా పూర్తి చేయడం జరిగిందని, అందుకే ఇటీవల 5 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చిన సరే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ ప్రజలు గుండెల మీద చేయేసి పడుకొన్నారని అన్నారు. వైస్సార్సీపీ కి మద్దతుగా నిలిచినందుకు గత తెలుగుదేశం ప్రభుత్వం లో ఈ ప్రాంతాన్ని ప్రజలని పూర్తిగా నిర్లక్ష్యం చేసి స్థానిక ప్రజాప్రతినిధులు ఎన్నిసార్లు మొరపెట్టుకొన్న పట్టించుకోకుండా వదిలేశారని, రిటైనింగ్ వాల్ పేరుతో నాసిరకం పనులు చేసి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వారి బినామిలకి నిధులు దోచిపెట్టారని విమర్శించారు. నాడు ఈ ప్రాంతంలో ఉన్న ఇళ్ళు అన్ని తీసేయలని ప్రజలను భయపెట్టి వారికి సరైన ప్రత్యామ్నాయం చూపకుండా చేసారని, కానీ నేడు జగన్ గారు కేవలం అవసరమైన మేరకు మాత్రమే ఇల్లు కాళీచేపించి వారందరికి అధునాతన మౌలిక సదుపాయాలు కల ఇళ్ళు నిర్మించి ఉచితంగా ఇచ్చారని అది మా ప్రభుత్వ చిత్తశుద్ధి అని అన్నారు. అదేవిధంగా గతంలో మాదిరి టీడీపీ నాయకులకు, జన్మభూమి కమిటీలకు లంచాలు ఇచ్చే పనిలేకుండా వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థ ద్వారా పారదర్శకంగా పధకాలు అందిస్తున్నారని ప్రజలు వారి సంతోషం వ్యక్తం చేస్తూ మా వైస్సార్సీపీ నాయకులకు బ్రహ్మరథం పడుతున్నారు అని ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పుడు టీడీపీ నాయకులు ఇదేమి ఖర్మ అంటూ మరో కొత్త నాటకానికి తెరలేపారని ప్రజలు మాకు ఇదేమి ఖర్మ మీతో అని అనుకొంటున్నారని ఎద్దేవా చేశారు. మీరు ఎన్ని డ్రామాలు చేసిన ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, వారి సంపూర్ణ మద్దతు ప్రభుత్వానికే అని ధీమా వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో 17వ డివిజన్ కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డి, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,నాగవంశ కార్పొరేషన్ ఛైర్మెన్ బొడ్డు అప్పలకొండమ్మ, డైరక్టర్ ఎర్నేటి సుజాత వైసిపి నాయకులు కాశీ, తాజుద్దీన్,వెంకటేశ్వరావు, తిరుపతిరెడ్డి, సుధాకర్, దామోదర్, గీతా కుమారి, జయమ్మ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News