Breaking News

సంచార జాతులు, వెనుకబడిన కులాల కు ప్రాధాన్యత నివ్వాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో సంచార జాతులు, వెనుకబడిన కులాల కు ప్రాధాన్యత నివ్వాలని జాతీయ ఎస్సీ ఎస్టీ బీసీ మానవ హక్కుల కమిషన్ బోర్డు సభ్యులు టి. నరసింహ సూచించారు. నగరంలోని జాయింట్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జాతీయ ఎస్సీ ఎస్టీ బీసీ మానవ హక్కుల కమిషన్ బోర్డ్ సభ్యులు టి నరసింహ జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సభ్యులు నరసింహ మాట్లాడుతూ వెనుకబడిన కమ్యూనిటీలో ఉన్న డీ నోటిఫైడ్ ట్రైబ్స్ (డిఎన్ టి) లను గుర్తించి గణన జరగాలని కోరారు. ఆయా వర్గాలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాల లబ్ధి చేకూర్చాలన్నారు. డీనోటిఫైడ్, సంచార ,ఉపసంచార తెగలకు కేంద్ర జాతీయ కమిషన్ (ఎన్ఎస్ డిఎన్ టి) ఏర్పాటు చేసిందన్నారు. యాంత్రోపాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, నీతి అయోగ్ లు డిఎన్ టి కమ్యూనిటీలను గుర్తించి వారిని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ భాగాల్లో చేర్చేందుకు అవసరమైన సర్వే నిర్వహిస్తోందన్నారు. సంచార జాతుల అభివృద్ధి సంక్షేమానికి, విద్యా బోధనకు తీసుకోవలసిన చర్యలపై జాతీయ ఎస్సీ ఎస్టీ బీసీ మానవ హక్కుల కమిషన్ బోర్డు సభ్యులు టి నరసింహ జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్ తో చర్చించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *