విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో రోజురోజుకు ప్రజలలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అబద్ధపు ప్రచారాలతో రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాయి అని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ విమర్శించారు. శనివారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 17వ డివిజన్, 80వ సచివాలయం పరిధిలోని రాణిగారి తోట సుబ్రమణ్య స్వామి గుడి ప్రాంతాల్లో నాయకులు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది తో కలిసి ఇంటింటికి వెళ్లిన అవినాష్ ప్రభుత్వం ద్వారా వారి కుటుంబాలకు అందుతున్న సంక్షేమ లబ్ది వివరాల కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వం లో పూర్తి నిర్లక్ష్యనికి గురైన ఈ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కోట్ల రూపాయల నిధులు వెచ్చించి రోడ్లు, డ్రైనేజ్ అభివృద్ధి చేయడం జరిగిందని,అదేవిధంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేయడం జరిగిందని అన్నారు. వైస్సార్సీపీ నాయకులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తున్నారని సంతోషం వ్యక్తం చేస్తూ మహిళలు మాకు ఘన స్వాగతం పలకడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని అవినాష్ అన్నారు. వచ్చే నెల నుండి ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన విధముగా పెన్షన్ పెంచి ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకొంటే తెలుగుదేశం నాయకులు వారి అనుకూల మీడియా ద్వారా పెన్షన్లు తొలగింపు అని అబద్ధపు ప్రచారాలు చేయడం సిగ్గుచేటు అని, స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తన డ్రామాలు, బూటకపు షో లతో ఇన్నిరోజులు ప్రజలను మభ్యపెట్టి గెలిచారని,కానీ ఇప్పుడు ప్రజలకు ఆయన నిజస్వరూపం అర్థమైంది అని రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అవినాష్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో 17వ డివిజన్ కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డి,నాగవంశ కార్పొరేషన్ డైరక్టర్ ఎర్నేటి సుజాత వైసిపి నాయకులు కాశీ,తాజుద్దీన్, వెంకటేశ్వరావు, తిరుపతిరెడ్డి, సుధాకర్,దామోదర్,గీతా కుమారి,జయమ్మ తదితరులు పాల్గొన్నారు.
మృతుల కుటుంబాలకు 3లక్షల నష్టపరిహారం
ఇటీవల ప్రమాదవశాత్తు కృష్ణానదిలో మునిగి మృత్యువాత పడిన 5గురు విద్యార్థుల కుటుంబాలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు 3లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించినట్టు తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. ప్రమాదం ఘటన గురుంచి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే తన సంతాపాన్ని తెలియజేసి వారి కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇవ్వడమే గాక తక్షణమే 3లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించి ఆయన మంచి మనసు చాటుకొన్నారని తెలిపారు. వైయస్సార్ కాంగ్రెస్ నాయకులు కూడా నిత్యం వారి కుటుంబాలను పరమర్శిస్తూ వారికి అండగా నిలుస్తున్నారు అని, వీలైనంత త్వరగా పరిహారం నగదు బాధిత కుటుంబాలకు అందజేస్తామని అవినాష్ భరోసా ఇచ్చారు.
Prajavartha Online Telugu News