Breaking News

వెంకయ్యనాయుడు చే అభినందనలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రాచీన తెలుగు భాష మూలాలను వెలుగులోకి తెస్తూ, “తెలుగు భాషకు ఆద్యులు – తెనుగోళ్ళు” సంకలన గ్రంథాన్ని ప్రచురణ చేయించిన పి.వి.ఎల్.ఎన్. రాజు, పిల్లి లక్ష్మీతులసి దంపతులను భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందించారు.

క్రీ.శ. 575 సం||లోనే రేనాడు రాజ్యాన్ని పరిపాలిస్తూ తొలిగా తెలుగుభాషకు సంపూర్ణ అక్షర రూపం కల్పించి, వాక్య నిర్మాణం చేసి తెలుగును తమ రాజ్యంలో రాజభాష (అధికార భాష)గా చేసి తొలి తెలుగు శాసనం కడపజిల్లా కమలాపురం తాలూకా కలమళ్లలోని శ్రీ చెన్నకేవస్వామి ఆలయ ప్రాంగణంలో వేయించారు. శాసనపూర్వక ఆధారాలతో రాజు దంపతులు సంకలన గ్రంథ రూపంలో ప్రచురణ చేయించారని విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావు, వెంకయ్యనాయుడికి వివరించారు. రాజు దంపతులు శనివారం ఉదయం వెంకయ్యనాయుడు ని కలసి గ్రంధాన్ని అందించి శ్రీ షిరిడిసాయి బాబా శాలువాతో సత్కరించారు. ఈ గ్రంథము పై వెంకయ్యనాయుడు స్పందిస్తూ తెలుగు భాష ప్రపంచవ్యాప్తికి ఇలాంటి గ్రంథాలు దోహదపడగలవని అన్నారు.

రచయితల మహాసభలకు విచ్చేసి ముఖ్య అతిథులకు, ప్రతినిధులకు సంకలన గ్రంథం అందచేత ప్రపంచ తెలుగు రచయితల మహాసభల ముఖ్య అతిథులుగా విచ్చేసిన మరియు సభలకు హాజరు అయిన ప్రతినిధులందరికీ సంకలన గ్రంథాన్ని ఉచితంగా అందజేయడంపై పలువురు ప్రస్తుతించారు.

ఈ మహాసభల్లో ఆత్మీయ అతిధిగా పాల్గొన్న తొలితెలుగు దివ్వె సంఘ అధ్యక్షురాలు పిల్లి లక్ష్మీతులసి
ఈ సభల్లో పాల్గొన్న తొలి తెలుగు దివ్వె, తెలుగు మూలాల అధ్యయన సంఘం, అధ్యక్షులు, సంకలన కర్త, గ్రంథంలోని అంశాలను ప్రస్తావిస్తూ ఎండకు ఎండి, వానక తడిచి శిధిలమైపోతున్న తొలి తెలుగు శాసనాలకు రక్షణ కల్పించి, భావితరాల కోసం తొలి తెలుగు శాసనాలన్నింటిని ఒకచోటకు చేర్చి మ్యూజియం ఏర్పాటు చేయాలని ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి మరియు పురావస్తు శాఖ వారి దృష్టికి తీసుకు రావాలని, వారు స్పందించకపోతే తెలుగు భాషాభిమానులందరు ప్రతి ఒక్క ఒక్క రూపాయి ఇస్తే ఈ తొలితెలుగు శాసనాలు పాడవకుండా కాపాడతానని ఆవిడ తెలియజేశారు. ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో తనను గౌరవ అతిథిగా ఆహ్వానించిన సభల గౌరవ అధ్యక్షులు మండలి బుద్ధప్రసాద్ గారికి, అధ్యక్షులు గుత్తికొండ సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి జి.వి. పూర్ణచందు లకు కృతజ్ఞతలు తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *