Breaking News

సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు మల్లాది విష్ణు క్రిస్మస్ శుభాకాంక్షలు

-శాంతి, స‌హ‌నానికి సూచిక‌ క్రీస్తు జ‌న‌నం
-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శాంతి, దయ, కరుణ, ప్రేమ ప్రపంచానికి చాటి చెప్పిన ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరికీ ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రేమ భావాన్ని, సేవాతత్పరతను బోధించిన క్రీస్తు జన్మదినం క్రైస్తవులకు అత్యంత సంతోషకరమైన రోజు అని పేర్కొన్నారు. లోక రక్షకుడుకైన ఏసుక్రీస్తు విశ్వమానవాళి శ్రేయస్సును కాంక్షించారని మల్లాది విష్ణు తెలిపారు. సహనం, క్షమాగుణాలు ఎంత గొప్పవో చాటేందుకు ఆ కరుణామయుడు తన రక్తం చిందించారన్నారు, ప్రపంచానికి శాంతి మార్గం చూపారన్నారు. ప్రతిఒక్కరూ సహనం, ప్రేమ కలిగి ఉండాలని, నిస్సహాయులపై కరుణ చూపాలని శతాబ్దాల క్రితమే క్రీస్తు ప్రబోధించారని గుర్తుచేశారు. ఈ పర్వదినాన్ని నియోజకవర్గ ప్రజలందరూ ఆనందోత్సాహాలతో వేడుకగా జరుపుకోవాలని మల్లాది విష్ణు ఆకాంక్షించారు. క్రిస్మస్ స్ఫూర్తి మన హృదయాలను ప్రేమ, కరుణతో నింపాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ప్రజలందరిపై జీసస్‌ కరుణ ఉండాలని.. ప్రభువు కృపతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం మరింత పురోభివృద్ధి సాధించాలని మనస్ఫూర్తిగా కాంక్షించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *