Breaking News

నగరంలో పల్సర్‌ పి150 ఆవిష్కరణ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బజాజ్‌ ఆటో, 150 సీసీ టైక్‌ పల్సర్‌లో అధునాతన వెర్షన్‌ను శనివారం వరుణ్‌ విజయవాడ షోరూంలో ఎం.ప్రభాకర్‌ ఆదిత్య, యూట్యూబర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పి.వి.సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, వరుణ్‌ బజాజ్‌ మాట్లాడుతూ… పూర్తి సరికొత్త పల్సర్‌ పి150ను ఆధునిక, స్పోర్టీ డిజైన్‌తో తీర్చిదిద్దడంతో పాటుగా అత్యున్నత పనితీరు మరియు నైపుణ్యంతో ఈ కొత్త పల్సర్‌ 150ను తెస్తున్నామని తెలిపారు. ఈ పల్సర్‌ పి150లో శక్తివంతమైన 149.68సీసీ ఇంజిన్‌, 4-స్ట్రోక్‌, 2-వాల్వ్‌, ఎయిర్‌కూల్డ్‌ ఇంజిస్‌తో రూపొందించారు. 14 హార్స్‌ పవర్‌ 13.5 ఎస్‌.ఎం టార్క్‌ అందించగల, 5 స్పీడ్‌ గేర్‌ బాక్స్‌, టై ఫంక్షనల్‌ ఎల్‌ఈడీ ప్రొజెక్టర్‌ హెడ్‌ల్యాంప్‌, మోనో షాక్‌ సస్పెన్షన్‌, యుఎస్‌బీ మొబైల్‌ చార్జింగ్‌, టిడిఈ (డిస్టెన్స్‌ టూ ఎమ్టీ) ఇందులో ఉన్నాయన్నారు. ఈ వాహనము రెండు వేరియంట్లలో సింగిల్‌ డిస్క్‌ (సింగిల్‌ సీట్‌) మరియు ట్విన్‌ డిస్క్‌ ( స్ల్పిట్‌ సీట్‌)లో లభ్యమవుతున్నాయి సింగిల్‌ డిస్క్‌ వేరియంట్‌ ఎక్స్‌ షోరూమ్‌ ధర రూ. 1,16,781/- ట్విన్‌ డిస్క్‌ ఎక్స్‌ షోరూమ్‌ వేరియంట్‌ ధర రూ. 1,19,782లు గా నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో బజాజ్‌ ఆటో రీజినల్‌ సర్వీస్‌ మేనేజర్‌ శ్రీనివాసులురెడ్డి, సిఈవో పద్మజ, వరుణ్‌ బజాజ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *