విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశ రక్షణ కోసం దేశ సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి పోరాటం సాగిస్తున్న సైనికులు త్యాగాలు అనిర్వచనీయం. సాయుధ దళాల పతాక దినోత్సవం (ఫ్లాగ్డే) పురస్కరించుకుని స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డిల్లీరావును జిల్లా సైనిక సంక్షేమ అధికారులతోపాటు ఇంటిగ్రేటెడ్ నేషనల్ వెట్రన్ ఆర్గన్కెజేషన్ (ఇన్వో), నేషనల్ ప్రెసిడెంట్ మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు మోటూరి శంకర్రావు తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్ డిల్లీరావు దేశ రక్షణ కొరకు పోరాడి ఆసువులుబాసిన సైనికుల కుటుంబ సభ్యులకు సాయుధ దళాల పతాక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ రక్షణలో పాటుపాడుతున్న ప్రతి సైనికునికి మనం ఎంతో రుణపడి ఉన్నామన్నారు. వారి రుణం తీర్చుకునే అవకాశం పతాక దినోత్సం కల్పించిందన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘ సభ్యులు, జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News