Breaking News

స్పందనలో వచ్చిన అర్జీలు.133

-స్పందనలో వచ్చిన అర్జీలు నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించాలి.
-ఏ ఒక్క అర్జీ ఓపెన్ కాకుండా అధికారులు అర్జీలను పరిశీలించాలి.
-అర్జీల పరిష్కారం క్షేత్రస్థాయిలో చేయాలి..
-జిల్లా కలెక్టర్ డా.కె. మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా వారం వారం స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని, అధికారులు వారి పరిధిలో గల అర్జీలు నిర్ణీత కాలంలోనే పరిష్కరించి అర్జీ దారునికి సత్వర న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత అధికారులు ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి133 అర్జీలను జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత, జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ తో కలిసి స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాధవీ లత మాట్లాడుతూ ప్రజలు వివిధ సమస్యల పై సుదూర ప్రాంతాల నుంచి స్పందనలో ఇచ్చిన అర్జీదారుల సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత కాలంలోనే పరిష్కరించి అర్జీదారునికి న్యాయం చేయాలన్నారు. క్షేత్ర స్థాయిలో అర్జీదారుని ఇంటి వద్ద ఫోటో తీసుకొని వాటి వివరాలు తీసుకొని అప్ లోడ్ చేయాలన్నారు. స్పందనలో వచ్చిన అర్జీలను ఆయా శాఖల వారీ అధికారులు ప్రతి రోజు పూర్తి స్థాయిలో పరిశీలించి క్షేత్ర స్థాయిలో పరిశీలన అనంతరం అర్జీదారునికి పరిష్కార పత్రాన్ని అందించడం తోపాటు పోటోతో కూడిన డేటాను స్పందన వైబ్ సైట్ లో అప్ లోడ్ చెయ్యాలన్నారు. ప్రతి గురువారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్పందన ఇతర ప్రభుత్వ ప్రాధాన్య అంశాలపై సమీక్షలు నిర్వహిస్తున్నారన్నారు. ఈ మేరకు జిల్లాలో ఆయా శాఖల వారి చేపట్టి అమలు చేస్తున్న లక్ష్యసాధన నివేదికలను సోమవారం నాటికి సిద్ధం చేయాలన్నారు. నెలలో ప్రతి 1, 2 వారాల్లో వైద్య ఆరోగ్యం, విద్య, స్త్రీ శిశు సంక్షేమం పై, 2,4 వారాల్లో రెవిన్యూ, అగ్రికల్చర్, హార్టికల్చర్, పశుసంవర్ధక, హౌసింగ్, మత్స్యశాఖ, గ్రామ వార్డు సచివాలయాలు పనితీరు, గడపగడపకు మన ప్రభుత్వం ద్వారా అమలు చేస్తున్న అంశాలపై సమీక్షలు ఆయా శాఖల అధికారులతో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందుకు సంబంధించి పూర్తిస్థాయి నివేదికలతో సంబంధిత శాఖల అధికారులు సమావేశాలకు హాజరుకావాలన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 466 అర్జీలు పెండింగ్ లో ఉన్నాయని వాటిలో 22 పిర్యాదులు తిరిగి రావడం జరిందన్నారు. 48 గంటల్లోగా పరిష్కారం చేయాల్సినవి 8 అర్జీలు, 24గంటల్లో పరిష్కరించాల్సినవి 2 అర్జీలు, 5 రోజుల్లో పరిష్కారం చేయాల్సినవి 26 ఉన్నాయని జాయింట్ కలెక్టరు తేజ్ భరత్ తెలిపారు.

స్పందనలో వచ్చిన కొన్ని అర్జీలు :-
రాజానగరం మండలం చక్రదారబంధం గ్రామానికి చెందిన ఎం.వెంకటరమణ తమ అర్జీలో వారసత్వంగా తమ తండ్రి గారి నుంచి 753,సర్వే నెంబర్ల లో 9.90 ఎకరాలు, 172/2 సర్వే నెంబర్ల లో 3.90 ఎకరాలు వచ్చియున్నది. అయితే రెవెన్యూ అధికారులు మా భూమిని తారుమారు చేసి వేరొకటి పేరున రికార్డు సృష్టించిన్నారు. కావున తగు న్యాయం చేయాలని వారు ఆర్జీలో కోరారు. దీనిపై జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ స్పందిస్తూ సమస్యను పరిష్కరించే విధంగా క్షేత్ర స్థాయిలో పరిశీలించి నివేదిక సమర్పించాలని రాజానగరం తాసిల్దార్ కు ఆదేశాలు జారీ చేశారు.

గోకవరంకు చెందిన చల్లా శ్రీలక్ష్మి తమ అర్జీలో వివరిస్తూ తన పేరు మీద నాలుగు విద్యుత్ మీటర్లు ఉన్నాయని పెన్షన్ నిలుపుదల చేయడం జరిగిందని, మరణించిన తన భర్త పేరు మీద ఉన్న ఆ మీటర్లు కనెక్షన్ తొలగించి తనకు తిరిగి పెన్షన్ ఇప్పించవలసిందిగా వారు ఆర్జీల కోరారు.

ఈ స్పందన కార్యక్రమం లో డీఆర్వో జి. నరశింహులు, జిల్లా అధికారులు టీబి, ఏయిడ్స్ కంట్రోలింగ్ అధికారి డా. ఎన్. వసుందర,సీపీఓ కె.ప్రకాష్, ఆర్ డబ్ల్యు ఎస్ ఎస్ ఈ డి. బాల శంకర్ డీఎల్ పి వో సత్యనారాయణ, జిల్లా హౌసింగ్ అధికారి బి.తారాచంద్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మాధవ రావు, పశుసంవర్ధక శాఖ అధికారి సత్యగోవిందం, డ్వామా పీ డి జిఎస్ రామగోపాల్, డిఆర్డిఏ పీ డి సుమలత, డిటిఒ ఎన్.సత్యనారాయణ ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చైర్మన్ కె. బుచ్చి రామ్ ప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి

-గొల్లపూడి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ కార్యాలయంలో అభినందన కార్యక్రమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *