రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న పాల వెల్లువ (అమూల్)- తూర్పు గోదావరి జిల్లా సాబర్ కాంతి సహకార డైరీ, ఆంధ్ర ప్రదేశ్ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్ ఆధ్వర్యంలో మరింత గా పాడి పరిశ్రమ పై ఆధారపడిన కుటుంబాలకు మేలు చేసే విధంగా ప్రజల్లోకి వాటి లక్ష్యాలను తీసుకుని వెళ్లాలని కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు.
సోమవారం రాత్రి కలెక్టరేట్ లో జగనన్న పాల వెల్లువ కరపత్రా లను కలెక్టర్ మాధవీలత, జెసి తెస్ భరత్ లు అవిష్క రించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె.. మాధవీలత మాట్లాడుతూ, రాష్ర్టంలో మహిళా డైరీ సహకార సంఘాల (MDAC) ద్వారా సాబర్ కాంత డైరీ పాలను సేకరించి తద్వారా రైతుల సామాజిక, ఆర్ధిక స్థితి మెరుగు పరచడానికి ఎంతగానో కృషి జరుగుతొందన్నారు. ఆ దిశలో సాటర్ డైరీ యాజమాన్యం ప్రస్తుతం చెల్లిస్తున్న పాల ధరకు అదనముగా రాయల్టీ బోనస్ ప్రతీ లీటరు పాలకు ప్రత్యేక ప్రోత్సాహకంగా చెల్లించాలని నిర్ణయించిందన్నారు. ఆమేరకు ప్రతీ నెల 7 వ తేదీన ఈ ప్రోత్సాహకం చెల్లిస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ నుంచి రైతులకు మరియు కార్యదర్శులకు సాబర్ డైరీ ప్రతి లీటరు పాలు పోయడము ద్వారా ప్రత్యేక ప్రోత్సాహకాన్ని అందిస్తున్నారని, ఈ విషయాలను పాల ఉత్పత్తి దారులు, మహిళా రైతులకు మరియు పాల సేకరణ కార్యదర్పులు అందరకి తెలియ చేసే దిశలో కరపత్రాలు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
పాల వెల్లువ పథకములో మధ్య దళారీలు ఉండరు అన్న విషయాన్ని రైతులు గమనించాలని, ఈ పథకములో కుటుంబములో కేవలం మహిళలు మాత్రమే మహిళా డైరీ సహకార సంఘాలలో సభ్యులు గా ఉంటారనే విషయాన్ని మహిళలు తెలుసుకోగలరన్నారు. ప్రతి పది (10) రోజులకు ఒక సారి పాల బిల్లులు నేరుగా రైతుల ఖాతాలలోకి జమ చేయబడును అనగా ప్రతీ నెల 5 వ తేదీ, 15 వ తేదీ మరియు 25 వ తేదీలలో సొమ్ము జమ చేయడం తో పాటు తదుపరి ప్రోత్సాహం రాయతి కూడా ఇవ్వడం జరుగుతుందని అన్నారు. జేసీ తేజ్ భరత్, డి ఆర్వో జీ.నరసింహులు, జిల్లా పసు సమర్ధక శాఖ అధికారి ఎస్ జిటి సత్య గోవింద్, డి హెచ్ ఓ. బి. తారా చంద్, డ్వామా పిడి జీ.ఎస్. రామ్ గోపాల్, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News