Breaking News

హై రిస్క్ గర్భిణీ స్త్రీల రిఫెరల్ పుస్తకాల అవిష్క రణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మాతాశిశు మరణాలు నమోదుకాని జిల్లాగా తీర్చిదిద్దడంలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హై రిస్క్ గర్భిణీ స్త్రీలపై ప్రత్యేక ద్రుష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మాతాశిశు సంరక్షణ కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో జీరో మాతృ మరణ‌ల నివారణ లో భాగంగా రూపొందించిన హై రిస్క్ గర్భిణీ స్త్రీల రిఫెరల్ పుస్తకాలను కలెక్టర్ ఢిల్లీరావు, జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్, డిప్యూటీ కలెక్టర్ జ్యోతి సురేఖ ఆవిష్కరించారు . ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ మాతా శిశు మరణాలను నివారించేందుకు గర్బీణీలో ప్రమాద లక్షణాలు ఎక్కువ కలవారిని (హై రిస్క్ ) ముందుగా గుర్తించి వారిని ప్రసవానికి ముందుగానే దగ్గరలో వున్న మాతా శిశు నిపుణులు కలిగిన ఆసుపత్రులుకు తరలించే పక్రియలోభాగంగా హెరిస్క్ గర్బీణీ తరలింపు రిజిస్టర్లు ఉపయోగపడతాయన్నారు. మాతా శిశు సంరక్షణ లో జిల్లాను ప్రధమ స్థానంలో నిలపాలని, మాతృ మరణాలు సంభవించని జిల్లాగా ఉండేలా కృషి చేయాలని కలెక్టర్ అన్నారు. ప్రమాదకర లక్షణాలు కలిగిన గర్భిణీ లను ముందుగానే గుర్తించి తగిన కార్యాచరణ ద్వారా సుఖ ప్రసవం అయ్యేలా చర్యలు తీసుకోవాలని తద్వారా తల్లి బిడ్డ ఆరోగ్య సంరక్షణకు దోహద పడవచ్చునని కలెక్టర్ పిలుపునిచ్చారు. హెరిస్క్ గర్బీణీ స్త్రీల ఆరోగ్యం పట్ల ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని వారిలో రక్త హీనత, పోషకాహార లోపాలను నివారించాలన్నారు. వైద్య ఆరోగ్య సంక్షేమానికి రాష్ట్రప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులను ఖర్చు చేస్తున్నదని అయినప్పటికీ అక్కడక్కడా మాతా శిశు మరణాలు సంభవించడం దురదృష్టకరమని కలెక్టర్ అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు సమన్వయంతో మరణాల నివారణకు ముందస్తు ప్రణాళికతో హై రిస్క్ గర్భిణీస్త్రీల ఆరోగ్యంపై ప్రత్యేక ద్రుష్టి సారించాలని కలెక్టర్ ఢిల్లీరావు అన్నారు. రిజిస్టర్ పుస్తకాల విడుదల కార్యక్రమంలో మెప్మా పీడీ జె. సునీత, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డా.యం.సుహసిని, జిల్లా క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ జె.ఉషారాణి, డి.సి.హెచ్.ఏస్ లక్ష్మి కుమారి ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *