గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
వడ్డీ లేకుండా ప్రస్తుత అర్ద సంవత్సరానికి ఆస్తి పన్ను చెల్లించే అవకాశం 3 రోజులు మాత్రమే (29,30,31 తేదీలు) మాత్రమే గడువు కలదని, పన్ను చెల్లింపుదార్లకు అనుకూలంగా క్యాష్ కౌంటర్లు ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు పని చేస్తాయని నగర కమీషనర్ శ్రీమతి కీర్తి చేకూరి ఐఏఎస్ గారు బుధవారం ఒక ప్రకటన ద్వారా తెలియచేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ గారు నగర ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ, 2022-23 రెండో అర్ధ సంవత్సరానికి వడ్డీ లేకుండా పన్ను చెల్లింపుకి ఈ నెలాఖరు వరకే గడువు ఉందని, నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయం, సర్కిల్ కార్యాలయంల్లోని క్యాష్ కౌంటర్లతో పాటు అదనంగా నగరంలోని భారత్ పేట 140 సచివాలయం, వసంతరాయపురం 148 సచివాలయం, పెద్ద పలకలూరు రోడ్ లోని 106 సచివాలయాల్లో కూడా పన్ను చెల్లించడానికి ప్రత్యేక క్యాష్ కౌంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. కావున నగర పాలక సంస్థకు చెల్లించవలసిన ఆస్తి పన్ను, నీటి పన్ను, ఖాళీ స్థలం పన్ను చెల్లించి నగరాభివ్రుద్దికి సహకరించాలని కోరారు.
నగరపాలక సంస్థ సచివాలయ కార్యదర్శులు పన్ను బకాయిదార్లకు ప్రత్యేక స్లిప్ ల ద్వారా బకాయిదార్లకు అందించాలని, ఫోన్ ల ద్వారా ప్రత్యేక కౌంటర్ల గూర్చి సమాచారం ఇవ్వాలన్నారు. 31 తర్వాత బకాయిదార్లకు నీటి కుళాయిలు, అత్యవసర సేవల నిలుపుదల నోటీసులు, ఆర్.ఆర్. యాక్ట్ ద్వారా బకాయిల వసూళ్లకు నోటీసులు సిద్దం చేయాలన్నారు. ఇప్పటికి కూడా పన్ను వసూళ్లు 50 శాతం వసూళ్లు చేయని అడ్మిన్ కార్యదర్శులు, ఆర్.ఐ., ఆర్.ఓ.లను టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తామని తెలిపారు.
Prajavartha Online Telugu News