Breaking News

పెన్షన్ పెంపు పంపిణీ….

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జనవరి 3 న రాజమహేంద్రవరం లో నిర్వహించే  పెన్షన్ పెంపు పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం లో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం స్థానిక  కలెక్టర్ కార్యాలయ సమావేశమందిరంలో  జాయింట్ కలెక్టర్, మున్సిపల్ కమీషనర్ లతో కలిసి సమన్వయ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, ప్రతి ఒక్క అధికారి వారికి శాఖ పరంగా, ముఖ్యమంత్రి పర్యటన నిమిత్తం పేర్కొన్న విధులను నిబద్దతతో పూర్తి చెయ్యలన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహనరెడ్డి జనవరి 3 వ తేదీ ఉదయం గుంటూరు జిల్లా తాడేపల్లి నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి రాజమహేంద్రవరం మున్సిపల్ స్టేడియం లో ఏర్పాటు చేస్తున్న  హెలిపాడ్ చేరుకుంటారన్నారు. అనంతరం రోడ్ షో ద్వారా  ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన సభా వేదికకు చేరుకొంటారన్నారు. సభా స్థలం వద్ద ఏర్పాటు చేసిన 13 రకాల పెన్షన్ పొందుతున్న లబ్ధిదారుల తో ఏర్పాటు చేసిన స్టాల్స్ తిలకించి అనంతరం లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమం  ఏర్పాటు చెయ్యడం జరుగుతుందని అన్నారు.  అనంతరం రూ.2500 నుంచి రూ.2750 కి పెంపుదల చేసిన పెన్షన్ ప్రకటన పై  సి ఎం సందేశం,  అనంతరం  పెంపుదల చేసిన పెన్షన్ చెక్ లబ్ధిదారులకు పంపిణీ తదుపరి బటన్ నొక్కడం ద్వారా  లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు  డి బి టి ద్వారా జమ చేస్తారని మాధవీలత పేర్కొన్నారు.

ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అందరం సమన్వయం చేస్తూ, విజయవంతం చేయడం జరిగిందని, అదే స్ఫూర్తి తో జనవరి 3 వ తేదీ ముఖ్యమంత్రి రాజమహేంద్రవరం పర్యటన విజయవంతం కావడం లో అత్యంత పకడ్బందీ గా ఏర్పాట్లు చేపట్టాలని స్పష్టం చేశారు.

ఆర్ అండ్ బి అధికారులు హెలిప్యాడ్, సిఎం పర్యటన చేసే రహదారి పొడవునా,  సభా వేదిక వద్ద  బ్యారి కెట్టింగ్ పనులు పూర్తి చేయాల్సి ఉందన్నారు.  సిఎం సభా ప్రాంగణంలో వి ఐ పి గ్యాలరీ, పెన్షన్ లబ్దిదారుల గ్యాలరీ, మీడియా గ్యాలరీ, సందర్శకుల గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ మాధవీలత అన్నారు. ఆయా గ్యాలరీ లకి ఇద్దరు చొప్పున ఇంఛార్జి అధికారులను నియమించామన్నారు.
వివీఐపి, వి ఐ పి, ప్రముఖులు, అధికారులు, ప్రజలు వచ్చే బస్సులు పార్కింగ్, సాంస్కృతిక కార్యక్రమాలు , మెడికల్ క్యాంపులు, ప్రోటోకాల్ తదితర అంశాలపై దిశా నిర్దేశం చేశారు.

ప్రోటోకాల్  మేరకు రెవెన్యూ అధికారులు సంబందించిన ప్రజా ప్రతినిధులు కు ఆహ్వానం పంపాలని, తగిన సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. రెవెన్యూ, పోలీస్, పంచాయతీ రాజ్, ఆర్ డబ్ల్యూ ఎస్, ఆర్ అండ్ బి, ఫైర్, అగ్ని మాపక, సమాచార శాఖ, విద్యుత్, వైద్య ఆరోగ్య శాఖ, మత్స్య శాఖ , రవాణా శాఖ తదితర అధికారులకు కేటాయించిన విధులపై కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు.

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్  భరత్, జిల్లా రెవెన్యూ అధికారి జీ నరసింహులు , ఆర్డీవో ఎస్. మల్లిబాబు, ఎ. చైత్ర వర్షిణి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈగల్ పోస్టర్లను, డ్రగ్స్ వద్దు బ్రో బ్యానర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, ఎస్పి లు

-ఆపరేషన్ త్రిశూల్’లో భాగంగా డ్రగ్స్, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమగ్ర కార్యాచరణ -మైక్రో లెవెల్‌లో సమస్యలను గుర్తించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *