-సి సి.ఎల్.ఏ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వై.ఎస్.ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష రీసర్వే తో పాటు పత్రాల పంపిణి ప్రక్రియను వేగవంతం చేయాలని సి.సి.ఎల్.ఏ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. గురువారం విజయవాడ సి.సి.ఎల్.ఏ కార్యాలయం నుండి వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం (సమగ్ర సర్వే) కార్యాచరణ, అమలు తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్ లతో స్పెషల్ సి ఎస్ సాయి ప్రసాద్ వీడియో కాన్ఫరెన్సు నిర్వహించ గా జిల్లా కలెక్టరేట్ నుండి జాయింట్ కలెక్టర్ డి.కె.బాలాజి, డి.ఆర్.ఓ శ్రీనివాసులు, ఏ.డి సర్వే జయరాజ్ పాల్గొన్నారు.
సి.సి.ఎల్.ఏ స్పెషల్ చీఫ్ సెక్రటరీ మాట్లాడుతూ… రాష్ట్ర వ్యాప్తంగా వైయస్సార్ శాశ్వత జగనన్న భూ హక్కు భూ రక్ష పత్రాల పంపిణీ కార్యక్రమంను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని అన్నారు. రీసర్వేకు సంబంధించి మ్యుటేషన్ కరెక్షన్, ట్రాన్సాక్షన్, తదితర అంశాలపై సమీక్షించారు.. మ్యూటేషన్స్ కోసం అందిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా పూర్తి చేసేలా సంబంధిత అధికారులతో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జాయింట్ కలెక్టర్ సంబందిత అధికారుల కు సూచిస్తూ ..వై.ఎస్.ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పత్రాల పంపిణీ వేగవంతం చేయాలని అన్నారు. భూ హక్కు -భూ రక్ష పత్రాల పంపిణీ చేసిన వెంటనే సంబందిత రైతుల నుంచి ఈ.కె.వై.సి ప్రక్రియను పూర్తి చేసేలా చూడాలని తెలిపారు. రీ సర్వే ప్రక్రియలో భాగంగా 71 -ఫైనల్ ఆర్.ఓ ఆర్, 79-డి.ఎల్.ఆర్ పనులు పూర్తి చేయాలని తెలిపారు. మ్యూటేషన్స్ కోసం అందిన ధరఖాస్తులను పెండింగ్ లేకుండా పూర్తి చేసేలా సంబందిత అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు.
Prajavartha Online Telugu News