Breaking News

ఐ టి ఐ విద్యార్థులకు ఉచిత పాలిటెక్నిక్ బ్రిడ్జ్ కోర్స్ : శ్రీలక్ష్మి

తిరుపతి , నేటి పత్రిక ప్రజావార్త :
పాలిటెక్నిక్‌లో 2వ సంవత్సరం ప్రవేశానికి అర్హత పరీక్షకు 60 శాతం మార్కులతో 10వ విద్యార్హతగా ఐటీఐలలో 2 సంవత్సరాల కోర్సులలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు తిరుపతిలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థలో ఉచిత కోచింగ్. ఐ టి ఐ ప్రిన్సిపాల్ మరియు కన్వీనర్ V. శ్రీలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిక్షణ కాలానికి ఎలాంటి అలవెన్సులు చెల్లించబడవు, అర్హులైన అభ్యర్థులు తమ ఐటీఐ, 10వ తరగతి సర్టిఫికెట్లు జిరాక్స్, ఆధార్ కార్డు, రెండు పాస్‌పోర్ట్ సైజు కలర్ ఫోటోగ్రాఫ్‌లతో 30-12-2022 నుండి 07-01-2023 వరకు నమోదు అవకాశం కలదు. నమోదు తర్వాత శిక్షణ 09-01-2023 నుండి 08-02-2023 వరకు నిర్వహించబడుతుందని మరింత సమాచారం కొరకు మురళీకృష్ణ (టైమింగ్ ఆఫీసర్), సెల్. 7799679351, 9293741997, 9492861369 నంబర్లలో సంప్రదించవచ్చు అని ఆప్రకటనలో తెలియజేసారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చైర్మన్ కె. బుచ్చి రామ్ ప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి

-గొల్లపూడి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ కార్యాలయంలో అభినందన కార్యక్రమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *