రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రైతులు వారి వద్ద ఉన్న ధాన్యంను వెంటనే కొనుగోలు కేంద్రాలకు సమాచారం అందచేసి విక్రయాలు పూర్తి చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో అంచనా వేసిన వరి సేకరణ 3.23 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, ఈ రోజు న (30.12.2022) 1192.960 మెట్రిక్ టన్నులధాన్యం సేకరణ జరిగినది మరియు ఇప్పటివరకు 41209 మంది రైతుల నుంచి 2,33,667.320 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగినదని తెలిపారు. రైతులు వారి వద్ద మిగిలిన RBK వద్దనున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలకు విక్రయించాలని, ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ చేసిన తదుపరి ఆయా కేంద్రాలను ముసివేయ బడునని ఇందుమూలముగా తెలియ చేసియున్నారు. రైతులు తమ ధాన్యాన్ని 17% తేమ వరకు ఆరబెట్టుకోవాలని మరియు వారి ధాన్యాన్ని విక్రయించడానికి తేదీ మరియు సమయాన్ని షెడ్యూల్ చెయ్యడం ద్వారా RBK సిబ్బంది అవసరమైన గన్నీలు మరియు రవాణా అవసరాన్ని ముందుగానే అంచన వెయ్యడం జరుగుతుంది. ఇప్పటివరకు రైతుల ఖాతాలలోకి రూ.152.68 కోట్ల ధాన్యం సొమ్మును జమచేయుట జరిగినదన్నారు. ఏవైనా సందేహాల కొరకు జిల్లా కార్యాలయం కంట్రోల్ రూమ్ నెంబర్లు 8309487151 మరియు 08832940788 నకు ఉదయం 8.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు సంప్రదించాలని సూచించారు.
Prajavartha Online Telugu News