రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో మూడు మండలాలకు చెందిన రెండో దశ తొమ్మిది గ్రామాల్లో 16557.57 ఎకరాల్లో రీ సర్వే పురోగతి లో ప్రగతి సాధించాలని జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ స్పష్టం చేశారు. శుక్రవారం రాత్రి రాజమండ్రీ డివిజన్ పరిధిలోని రాజానగరం, రంగంపేట, గోకవరం మండల తహశీల్దార్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ తేజ్ భరత్ మాట్లాడుతూ, రాజనగరం పరిదిలో. ఐదు గ్రామాలు, రంగంపేట లో మూడు గ్రామాల్లో, గోకవరం లో ఒక గ్రామంలో రెండో దశ రీ సర్వే ప్రక్రియ జరుగుతోందని, ఇందుకు 36 టీమ్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకూ 3,235.54 ఎకరాల్లో రీ సర్వే ప్రక్రియ పూర్తి చేయగా, శుక్రవారం 718.83 ఎకరాల్లో చేసిన పనులపై మండలాలు వారీగా సమీక్ష నిర్వహించారు. మరింత వేగంగా రీ సర్వే లక్ష్యాలను సాధించడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డి ఆర్వో జీ. నరసింహులు, ఆర్డీవో ఏ. చైత్ర వర్షిణి, ఏ వో కె. శ్రీనివాస రావు కలెక్టరేట్ నుంచి, మండల పరిధిలోని అధికారులు ఆయా మండలాలు నుంచి విసి లో పాల్గొన్నారు
Prajavartha Online Telugu News