విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువులు, పూజ్యులు శ్రీ శ్రీ శ్రీ ఆత్మానందమయి అమ్మ స్వయంగా అనుగ్రహిస్తున్న సుషుమ్న క్రియా యోగ దీక్షా కార్యక్రమం, విజయవాడలో జనవరి 1వ తేది ఆదివారం సాయంత్రం 5.30 నుంచి 7.30 వరకు ఏ కన్వెన్షన్ సెంటర్ లబ్బీపేటలో జరగనుంది. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో అధికార భాషా సంఘం అధ్యక్షుడు పి విజయబాబు తెలియజేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఈ కార్యక్రమం దివ్య బాబాజీ సుషుమ్న క్రియా యోగ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుందన్నారు. సుషుమ్న క్రియా యోగ ఫౌండేషన్ అంతర్జాతీయ ఆధ్యాత్మిక సేవా సంస్థ. పూజ్యశ్రీ అత్మానందమయి అమ్మ సుషుమ్న క్రియా యోగ సాధనకు సంబంధించిన అనేక సూక్ష్మాలను ఈ కార్యక్రమంలో తెలియజేస్తారన్నారు. ఒత్తిడిని తట్టుకోగల శక్తి, నైపుణ్యం, మానసిక ప్రశాంతతను కలుగజేసే చాలా ప్రభావంతమైన ప్రక్రియ ఈ సాధన. సుషుమ్న క్రియా యోగ సాధన ద్వారా శారీరక, మానసిక, భావపూర్ణ, సామాజిక, ఆధ్యాత్మిక స్వస్థతను సాధించవచ్చన్నారు. సుషుమ్న క్రియా యోగ అంతర్ చైతన్యాన్ని, ఉత్సాహాన్ని, ప్రేరణను, అందించటంతో పాటు, ఆరోగ్యవంతమైన జీవనానికి నాంది పలుకుతుందన్నారు. ఒత్తిడిని నివారించి, సామర్థ్యాన్ని, నేర్పును పెంపొందిస్తుంది. ప్రతి ఒక్కరు ఎంతో సులభంగా సాధన చేయగల మహత్తర ప్రక్రియ ఇదన్నారు. ఎంతో మంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతారన్నారు . ఈ కార్యక్రమానికి అందరికీ ఉచిత ప్రవేశం అని తెలిపారు. అనంతరం కార్యక్రమ బ్రోచర్ విడుదల చేసారు. ఈ విలేకరుల సమావేశంలో దివ్య బాబాజీ సుషుమ్న క్రియా యోగ ఫౌండేషన్ తరఫున అధికార భాషా సంఘం అధ్యక్షులు పి. విజయబాబు, ఫౌండేషన్ మెంబెర్ రుద్రరాజు శిరీష దేవి, ఫౌండేషన్ వాలంటీర్స్ భాస్కర్ రావు, శృతాకీర్తి జొన్నాలగడ్డ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News