– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలో ఏ ముఖ్యమంత్రి అమలు చేయని విధంగా వైఎస్సార్ పెన్షన్ కానుక పథకాన్ని మన రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్నారని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. నియోజకవర్గంలో 957 మందికి నూతన పింఛన్లు మంజూరు చేసినట్లు శనివారం ఆయన ఓ ప్రకటనలో తెలియజేశారు. వీరిలో 451 మంది అవ్వాతాతలు కాగా 363 మంది వితంతువులు, 125 మంది దివ్యాంగులు ఉన్నట్లు వెల్లడించారు. తెలుగుదేశం ప్రభుత్వంలో నియోజకవర్గంలో 17 వేల మందికి మాత్రమే పింఛన్ అందేదని.. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 25,428 కి పెంచినట్లు వెల్లడించారు. తొలి విడతలో ఆగష్టు నెలలో 1,460 మందికి నూతన పింఛన్లు మంజూరు చేయగా.. రెండో విడతలో 957 మందికి కొత్తగా అందజేస్తున్నట్లు తెలియజేశారు. గతంలో పోలిస్తే దాదాపు రూ. 10 వేల మందికి జగనన్న ప్రభుత్వంలో అధికంగా పింఛన్లు అందజేస్తున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. అర్హులందరికీ శాచ్యురేషన్ పద్ధతిలో పింఛన్ అందజేస్తున్నామని చెప్పడానికి ఈ అంకెలే నిదర్శనమని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం పింఛన్లలో పెద్దఎత్తున కోతలు విధించేదని.. కానీ పింఛన్ అర్హతను 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించిన ఘనత సీఎం వైఎస్ జగన్ కే దక్కుతుందని మల్లాది విష్ణు అన్నారు.
ఇంటి వద్దకే పింఛన్ దేశంలోనే ప్రప్రథమం
ఎన్నికలకు రెండు నెలల ముందు చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి పింఛన్ నెలకు కేవలం రూ.వెయ్యి మాత్రమే ఇచ్చేవారని.. కానీ వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం రూ.2,250 కి పెంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన చిత్తశుద్ధి నిరూపించుకున్నారని మల్లాది విష్ణు తెలిపారు. నూతన సంవత్సర కానుకగా ఇప్పుడు రూ.2,750 కు పెంచి వారం రోజుల పాటు పండుగ వాతావరణంలో అందజేయనున్నట్లు చెప్పారు. టీడీపీ హయాంలో పింఛన్ల కోసం లబ్ధిదారులు రోజుల తరబడి కార్యాలయాల బయట పడిగాపులు కాసే దయనీయ పరిస్థితులు ఉండేవన్నారు. పైగా 5, 6 డివిజన్లకు కలిపి ఒకచోట ఎండలో కూర్చోబెట్టి పింఛన్ దారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసేవారని గుర్తుచేశారు. అటువంటి అమానవీయమైన విధానానికి సీఎం జగన్ స్వస్తి పలికారన్నారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటివద్దకే పెన్షన్ అందిస్తుండటంతో పింఛనుదారులకు వ్యయప్రయాసలు తప్పాయని పేర్కొన్నారు. తెల్లవారుజామున 6 గంటల నుంచే అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, ఇతర లబ్ధిదారులు ఎక్కడ ఉంటే అక్కడికి వాలంటీర్లు వెళ్లి పింఛన్ డబ్బును అందజేస్తున్నట్లు తెలిపారు. డోర్ డెలివరీ పద్ధతిలో పెన్షన్లు అందించడం దేశంలోనే తొలిసారి అని తెలియజేశారు. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రతిఒక్కరూ అండగా నిలవాలని ఈ సందర్భంగా మల్లాది విష్ణు కోరారు.
Prajavartha Online Telugu News