విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర టిడిపి పిలుపు మేరకు, ఎంపి కేశినేని శ్రీనివాస్ (నాని) ఆదేశాలతో క్లస్టర్ ఇంఛార్జి బూర కనకారావు నాయకత్వములో విజయవాడ 37వ డివిజన్ పార్టీ అధ్యక్షులు పిళ్ళ సుదర్శన్ ఆధ్వర్యంలో రాష్ట్రములో దుర్మార్గపు పాలన, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల పోరాటం చేస్తూ ఇంటింటికీ వెళ్లి ప్రజలను ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు రూపకల్పన చేసిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమమాన్ని డివిజన్ లోని రమణయ్య కూల్ డ్రింక్ షాపు వద్ద నుండి కబెళ సెంటర్ వద్ద నుండి ప్రారంభించి యూనిట్ ఇంఛార్జిలు సోలంకి రాజేంద్ర కుమార్, మెండి జ్యోతి డివిజన్ కమిటీ సభ్యులు ఒన్ టౌన్ వ్యాపారస్తుల వద్ద సమస్యలు సేకరణ చేపట్టారు. జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షులు సోలంకి రాజేంద్ర కుమార్ మాట్లాడుతూ వ్యాపారస్తులు , ప్రజలు ఏ సమస్య వచ్చినా టిడిపి అండగా ఉంటుందని ఎంపి కేశినేని శ్రీనివాస్ (నాని) సహకారంతో అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, జటిలమైన సమస్యల మీద టీమ్ టిడిపి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేసి ప్రజల తరపున అండగా ఉంటామని ఒన్ టౌన్ లోనే నియోజకవర్గ పార్టీ కార్యాలయం కూడా ఏర్పాటు చేశామని అన్ని వేళల్లో అందుబాటులో ఉంటామని తెలిపారు.
మైనార్టీ నాయకులు ఎమ్ ఎస్ బేగ్ మాట్లాడుతూ అన్ని వ్యాపార సంఘాలు వ్యాపారస్తులు జగన్ పాలనలతో విస్తు చెందారని ఎప్పుడు ఎన్నికలు వస్తాయోనని వర్తక వాణిజ్య రంగాల ప్రజలు ఎదురు చూస్తున్నారని , జగన్ ఈ రాష్ట్రానికి పట్టిన అరిష్టమని బేగ్ అన్నారు.
డివిజన్ క్లస్టర్ ఇంఛార్జి బూర కనకారావు మాట్లాడుతూ ఒన్ టౌన్ మొత్తం వ్యాపార సంఘాల మీద ఆధారపడ్డ ముఠా కూలీలు ఎక్కువగా ఉండే ప్రాంతమని రోజు వారి వేతనాలు పెరిగినా కూడా ప్రభుత్వ పన్నులు, పరిగిన ధరలు వల్ల ఆదాయం చాలక అప్పులపాలైపోతున్నారని, బూటకపు సంక్షేమ పథకాలతో వందలో పది కుటుంబాలు కూడా సంతోషంగా లేరని ఆరోపించారు. డివిజన్ లో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకుంటామని కొంత మంది వాలంటీర్ ద్వారా పదకాలు తొలగిస్తారు కేసులు పెడతారని వారి సమస్యలు బయటకు చెప్పలేక పోతున్నారని అటువంటి వారు నియోజకవర్గం పార్టీ కార్యాలయం 7799447185 నంబరుకి సమస్యలు వాట్సప్ ద్వారా పంపాలని వివరాలు గోప్యంగా ఉంచి మీ సమస్య మా సమస్య గా టిడిపి పోరాటం చేస్తుందని డివిజన్ పార్టీ అధ్యక్షుడు పిళ్ళ సుదర్శన్,నియోజకవర్గ తెలుగు మహిళ అధికార ప్రతినిధి మెండి జ్యోతిలు ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా టిడిపి రాష్ట్ర కార్యదర్శి పెందుర్తి శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా టిడిపి కార్యాలయ కార్యదర్శి సారిపల్లి వెంకట రాధాకృష్ణ, రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యనిర్వహక కార్యదర్శి దనేకుల వెంకట సుబ్బారావు అతిథులుగా రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి గూడెల వెంకట రమణ (శ్రీను), ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి పరిసిపోగు రాజేష్,ఎస్సీ సెల్ కార్యదర్శి శిరంశెట్టి నాగేంద్ర, రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి నవిరి మహేష్ లు పాల్గొన్నారు.మాజీ కార్పొరేటర్ లు యేదుపాటి రామయ్య, సుకాసి సరిత,జిల్లా ఐ టిడిపి అధ్యక్షులు అద్దేపల్లి శివ, ఎస్సీ సెల్ అధ్యక్షులు యర్రా రామారావు,డివిజన్ పార్టీ అధ్యక్షులు కె యస్ ఆర్ శర్మ, దేవరకొండ చక్రవర్తి, నీలం మనోజ్ బాబు, కుప్పుల గంగాధర్ రెడ్డి,యూనిట్ ఇంఛార్జిలు కొట్టేటి సరిత, కోడెబోయిన స్రవంతి, తమ్మిన శేఖర్, బెవర రవి కుమార్, గంటా రాజు, కండుబోయిన సాంబశివరావు, సయ్యద్ ఇమ్రాన్, కపిలవాయి హరనాథ్, షేక్ బడేషా,సందక వెంకట్రావు, మైనార్టీ నాయకులు షేక్ తాజుద్దీన్, రహీముద్దిన్,అజీజ్,ఎమ్ ఎమ్ బెగ్, భాష, సంషేర్ ఖాన్ ,ఇమ్రాన్, దళిత నాయకులు కత్తి డేవిడ్ , పుట్ల గోపాలం, ప్రదీప్ 37డివిజన్ చేపట్టిన ఈ కార్యక్రమానికి మద్దతు పలికారుడివిజన్ నాయకులు అమరా మురళీకృష్ణ, పిళ్ళ రాజా, లీల మనోహర్, అడ్డూరి లక్ష్మణ, అల్లాడి మురళి, మెండిసందీప్, ఈది రోజా, మువ్వల జయరాం టిడిపి కార్యకర్తలు, మహిళలు , అభిమానులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News