విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన విధంగా ప్రతి హామీని అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దే అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. ఆదివారం నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్,23వ సచివాలయంలో ని లుర్దు నగర్ నందు జరిగిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న అవినాష్ నూతనంగా పెన్షన్ పెంచిన లబ్ధిదారులకు పాస్ పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ప్రమాణస్వీకారం రోజు ఇచ్చిన మాట ప్రకారం సంవత్సరానికి 250 రూ చొప్పున పెంచుతూ 2750 చేశారని, పెంచిన పెన్షన్ నేటి నుండి అందజేస్తుంటే ఆ అవ్వాతాత ల కళ్ళలో ఆనందం చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని అన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం లో అరకొర పెన్షన్ లు ఇస్తూ వాటి కోసం కూడా కార్యాలయాల చుట్టూ కళ్లరిగేలా తిరిగే పరిస్థితి ఉండేదని, అర్హత ఉన్న సరే జన్మభూమి కమిటీలకు లంచాలు ఇస్తే గాని పెన్షన్ ఇచ్చేవారు కాదని విమర్శించారు. జగన్ హామీ ఇచ్చిన తర్వాత ఎన్నికల ముందు హడావుడి గా పెన్షన్ పెంచి ఓట్లు రాజకీయాలకు తెర లేపారని కానీ ప్రజలకు వాస్తవాలు తెలుసు కాబట్టి వైసీపీ ని భారీ మెజారిటీతో గెలిపించారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా నేడు పాలన సాగుతోందని విశ్వాసం వ్యక్తం చేశారు. అర్హతే ప్రామాణికంగా నేరుగా ఇంటి వద్దకే పెన్షన్లు, సంక్షేమ పథకాలు అందిస్తుంటే ఇప్పుడు తెలుగుదేశం వారికి వారి రాజకీయ మనుగడ కోసం ఏమి చేయాలో పాలుపోక పెన్షన్లు తీసేసుస్తున్నారని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు అని, ఒక్కసారి మీ ప్రభుత్వం లో ఇచ్చిన పెన్షన్లు ఎన్ని, ఇప్పుడు ఎన్ని ఇస్తున్నారో చూడాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో 3వ డివిజన్ కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవల్లిక,వైసిపి నాయకులు డేవిడ్ రాజు,కోటినాగలు, భీమిశెట్టి నాని,కిస్సి,జాకోబ్, గ్రామ, వార్డ్ సచివాలయం సిబ్బంది మరియు కన్వీనర్లు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News