-సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునేందుకే ముఖ ఆధారిత హాజరు..
-ముఖ ఆధారిత హాజరుపై ఉద్యోగులకు అధికారులకు శిక్షణ ఇస్తున్నాం.
-జిల్లా కలెక్టర్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు జనవరి 2వ తేది నుండి ఏపిఎఫ్ ఆర్‌ఎస్ యాప్ ద్వారా హాజరు తప్పని సరి అని సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేయడంతో సోమవారం అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో మొబైల్‌ఫోన్ లో ఏపిఎఫ్ ఆర్‌ఎస్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడంతో సందడి వాతావరణం నెలకొంది
జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని పింగళి వెంకయ్య సమావేశ మందిరానికి ఉదయం 10 గంటలకే జిల్లా అధికారులు హాజరయ్యారు. సరిగ్గా 10 గంటల 2 నిమిషాలకు జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు, స్పందన కార్యక్రమంలో పాల్గొన్ని 10.09 నిమిషాలకు ఏపిఎఫ్ ఆర్‌ఎస్ యాప్ ద్వారా ఆయన ముఖ ఆధారిత హాజరును నమోదు చేసుకున్నారు. అనంతరం జిల్లా అధికారులు, ఉద్యోగులకు యాప్ డౌన్‌లోడ్ చేసుకునే విధానంపై వివరించి అవగాహన కల్పించారు. ఈసందర్భంగా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అధికారులు, ఉద్యోగులు ముఖ ఆధారిత ద్వారా ప్రతి రోజు హాజరును నమోదు చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలను జారీ చేయడం జరిగిందన్నారు. ముఖ ఆధారిత హాజరు నమోదులో కొత్తగా ఎటువంటి నియమ నిబంధలను విధించలేదన్నారు. గతంలో ఉన్న నిబంధనలను మాత్రమే నూతన విధానంలో పొందు పరచడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వ కార్యాలయంలో మాన్యువల్‌గా హాజరును తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రతి ఉద్యోగికి మూడు సార్లు గంటకు మించి ఆలస్యంగా కార్యాలయాల విధులకు హాజరతే ఒక రోజు సాధారన సెలవుగా పరిగణించే నిబంధన అమలులో ఉందన్నారు. ముఖ ఆధారిత హాజరు ద్వారా ఉద్యోగి ఏ సమయానికి విధులకు హాజరయింది. ఏ సమయానికి కార్యాలయం విడిచి వెళ్లింది స్పష్టంగా నమోదు చేయడం జరుగుతుందన్నారు. సహజంగా ఎక్కువ శాతం అధికారులు కార్యాలయం సమయం హాజరై నిర్థేశించిన దానికంటే ఎక్కువ సమయం కూడా పని చేస్తారని అటువంటి వారి వివరాలను కూడా తెలుసుకోవడానికి వీలు ఉంటుందన్నారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ విధానం వలన జవాబు దారితనం పెరుగుతుందని ప్రజలలో ప్రభుత్వం ఉద్యోగులు ఆలస్యంగా హాజరవుతారనే అపోహాలను తొలగించి వారికి పారదర్శకతతో కూడిన సేవలు అందిస్తున్నట్లు సందేశం ఇవ్వగలుగుతామని, ప్రజలలో ఉద్యోగులపై అపరమైన గౌరవం పెరుగుతుందని అన్నారు. దీనిని ప్రతి ఉద్యోగి సానుకూలదృక్పదంతో తీసుకుని సాంకేతిక విధానం ద్వారా ముఖ ఆధారిత హాజరును నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ విధానం పై ఉద్యోగులకు వివరించేందుకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. ఈ యాప్‌లో కార్యాలయపు లోకేషన్ నుండి మాత్రమే హాజరు నమోదు చేసుకునేందుకు వీలంటుందని క్షేత్రస్థాయిలో పని చేసే అధికారులు, ఉద్యోగులు ముఖ ఆధారిత హాజరు నమోదులో కొంత సందిగ్దం ఉందని, త్వరలో దీనిని నివృత్తి చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డిల్లీరావు తెలిపారు.
అనంతరం సమావేశానికి హాజరైన డిఆర్‌వో కె. మోహన్‌కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ముఖ ఆధారిత హాజరును నమోదు చేసుకున్నారు.
Prajavartha Online Telugu News