Breaking News

వృద్దులు, వితంతువులు, మహిళాలు, కార్మికులకు 2,750 రూపాయలకు పింఛన్‌ పెంపు…

-ఇకపై 2,750 రూపాయలు పింఛన్‌ను ప్రతి నెల 1వ తేదిన ఠంఛన్‌గా అందింస్తాం…
-జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పెన్షన్‌ 3 వేల రూపాయల వరకు పెంచుతామనే ఇచ్చిన మాటను నిలబెట్టుకునే దానిలో భాగంగా వృద్దులు, వితంతువులు, చేనేత కార్మికులు, ఒంటరి మహిళలు, మత్స్యకారులు, సాంప్రదాయ చర్మకారులు, ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులకు జనవరి నెల నుండి 2,750 రూపాయలను పింఛన్‌ను ఠంఛన్‌గా అంధించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌. డిల్లీరావు తెలిపారు.
వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పెంపు పై పురపాలక, పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఆద్వర్యంలో రూపొందించిన వాల్‌పోస్టర్లను సోమవారం కలెక్టరేట్‌ పింగళివెంకటయ్య సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 2,25,271 మందికి పెన్షన్‌ను అందజేయడం జరుగుతుందని మరో 7,595 మంది కొత్త పింఛన్‌దారులను అర్హులుగా గుర్తించడం జరిగిందని మొత్తం 2,32,866 మందికి 64 కోట్ల 60 లక్షల 31 వేల 250 రూపాయలను పెన్షన్‌ ద్వారా అందిస్తున్నామన్నారు.
ఇందులో వృద్దులు, వితంతువులు, చేనేత కార్మికులు, ఒంటరి మహిళలు, మత్స్యకారులు, సాంప్రదాయ చర్మకారులు, ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులు, ఏపిసిఆర్‌డిఏ పదిధిలో భూమిలేని నిరుపేదలకు, వికలాగులు, ట్రాన్స్‌జెండర్‌లు, డప్పు కళాకారులు మల్లిడిపార్మిటీ లెప్రసీ వ్యాధిగ్రస్తులకు ప్రతి నెల పెన్షన్‌ సకాలంలో అందజేస్తున్నామన్నారు. ప్రభుత్వం ఈనెల 3వ తేది నుంచి పెన్షన్‌ వారోత్సవాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం పెన్షన్‌ పెంచిన విషయాన్ని పెన్షన్లదారులకు వివరించి పెన్షన్‌ను అందజేసి వారోత్సవాలను విజయవంతం చేయాలన్నారు. పెన్షన్‌ సంబంధించి వాల్‌పోస్టర్‌ను జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో పదర్శించి ప్రజలలో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు తెలిపారు.
పోస్టర్‌ విడుదల కార్యక్రమంలో డిఆర్‌వో కె. మోహన్‌కుమార్‌, డిఆర్‌డిఏ పిడి శ్రీనివాస్‌రావు, జిలా కోపరేటివ్‌ అధికారి సిహెచ్‌ శైలజ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *