-కోడి పందాలు నిర్వహించినా.. పాల్గొన్నా.. చట్టరీత్యా నేరమే..
-జిల్లా కలెక్టర్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కోడి పందాలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని ఉల్లంగించిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు హెచ్చరించారు.
జిల్లాలో కోడి పందాలు నివారించేందుకు ముందస్తు చర్యలలో భాగంగా సోమవారం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా జంతు సంక్షేమ సంఘం చైర్మన్ ఎస్. డిల్లీరావు సంబంధిత శాఖల అధికారులతో కలెక్టరేట్‌లోని పింగళివెంకయ్య సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్ 1974 సెక్షన్ 34` జంతుహింస నివారణ చట్టం 1960 ల ప్రకారం కోడి పందాలను నిషెదించడం జరిగిందన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించికుని జిల్లాలోని పలు ప్రాంతాలలో నిర్వహకులు కోడి పందాలను నిర్వహించే అవకాశాలు ఉన్నాయన్నారు. దీనిని దృష్టిలో పెటుకుని కోడి పందాలను నివారించేందుకు గట్టి నిఘా ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలన్నారు. జంతు సంరక్షణ చట్టం ప్రకారం పందాలు నిర్వహించిన వీక్షేంచేందుకు పాల్గొన్న నేరమేనన్నారు. ఈ విషయాన్ని ప్రజలకు అర్థమయ్యే రీతిలో ప్రచారం నిర్వహించి కోడి పందాలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పోలీస్, రెవెన్యూ, పశుసంవర్థక శాఖ అధికారులు సమన్వయంతో టీమ్‌లుగా ఏర్పాడి క్షేత్రస్థాయిలో పర్యటించి కోడి పందాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
అనంతరం కోడి పందెములు నిర్వహించుట` పాల్గొనుట చట్టరీత్యా నేరం పై ముద్రించిన వాల్‌పోస్టర్‌ను కలెక్టర్ డిల్లీరావు విడుదల చేశారు.
సమావేశంలో డిఆర్‌వో కె. మోహన్‌కుమార్, పశుసంవర్థక జెడి కె. విద్యాసాగర్, డిఆర్‌డిఏ పిడి శ్రీనివాస్‌రావు, డిసివో సిహెచ్ శైలజ, తదితరులు ఉన్నారు.
Prajavartha Online Telugu News