Breaking News

మన హక్కులను మనమే కాపాడుకోవాలి…

-కేసిఆర్ ను ఆంధ్ర ప్రజలు స్వాగతించరు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బీఆర్ఎస్ పేరుతో ఆంధ్రలోకి అడుగుపెడుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆంధ్ర ప్రజలు తిప్పుకొడతానికి సిద్ధంగా ఉన్నారని ఆంధ్ర యునైటెడ్ ఫ్రంట్ చైర్మన్ మరియు సినీ నటుడు రాంకీ అన్నారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్క్లబ్లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్ర వారిని కించపరిచే విధంగా దొంగలు అన్న వ్యక్తి నేడు బి ఆర్ ఎస్ పార్టీ నీ అడ్డుపెట్టుకొని ఆంధ్రలోకి అడుగుపెడుతున్నాడని వ్యాఖ్యానించారు. ఆంధ్ర ప్రజల పై ద్వేషం వెళ్ళకక్కి అదే అంశం మీద పునాదులు వేసుకుని తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ ముసుగులో ఆంధ్రాలోకి అడుగుపెడుతున్నాడని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలికి జగన్మోహన్ రెడ్డికి లాభం చేకూర్చటానికి కేసీఆర్ ఏపీ రాజకీయాల్లోకి వస్తున్నాడని వెల్లడించారు. ఆంధ్ర ప్రజలను అనేక రకాలుగా కించపరిచిన కేసీఆర్ ఆంధ్ర లోకి అడుగు పెట్టాలంటే ముందుగా ఆంధ్ర ప్రజల కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇది రాజకీయ పార్టీ కాదని అనేక సంఘాల తో ఏర్పడిన ఆంధ్ర యూనైటెడ్ ఫ్రంట్ యువతకు ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. ఆంధ్ర యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ మేడ శ్రీనివాస్ మాట్లాడుతూ కెసిఆర్ ఆంధ్రలోకి ఏ అర్హతతో అడుగుపెడుతున్నారని ప్రశ్నించారు. నేటికీ తెలంగాణ పోరాటంలో అమరవీరులైన వారికి న్యాయం చేయలేదని వ్యాఖ్యానించారు. ఆంధ్ర ప్రదేశ్ లో కేసిఆర్ విభేదాలను కు ఆద్యం పోస్తున్నారని, ఇక్కడ కులపరమైన విద్వేషాలు రెచ్చగొట్టవద్దని హెచ్చరించారు. విభజన సమయంలో ఆంధ్ర వారిని నీచంగా వర్ణించారని, దానిని ప్రజలు ఇంకా మర్చిపోలేదని కెసిఆర్ బిఆర్ఎస్ పార్టీని ప్రజలు తిప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర నాయకులు ఫణి రాజ్, ఆంధ్ర యునైటెడ్ ఫోరమ్ డిప్యూటీ చైర్మన్ బెతు రామ్మోహన్, జై ఆంధ్ర డెమోక్రాటిక్ ఫోరమ్ రాష్ట్ర కోఆర్డినటర్ చెవుల కృష్ణాంజనేయులు, అత్తిలి రాజు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *