Breaking News

అమరావతి నుంచి జూమ్ కాన్ఫరెన్స్…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో వివిధ రెవెన్యూ గ్రామ పంచాయతీల పరిధిలోని ఎస్సీ నివాస ప్రాంతాల్లో స్మశాన వాటికల కోసం 55 గ్రామాల్లో 25.55 ఎకరాలు లకు గాను 51 గ్రామాల్లో 24.48 ఎకరాల ప్రభుత్వ భూములను గుర్తించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత అన్నారు.

బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యదర్శి రేవు ముత్యాల రావు అమరావతి నుంచి నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్ కి కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో 272 రెవెన్యూ గ్రామాల్లో మొత్తం 430 శివారు నివాస ప్రాంతాలు ఉండగా, వారిలో 346 ఎస్సీ నివాస ప్రాంతాలు ఉన్నాయన్నారు. జిల్లాలో ఇప్పటి వరకూ ఎస్సీ కాలనీల కోసం వచ్చిన వాటికి గాను 22 గ్రామాల్లో 14.74 ఎకరాలు కేటాయింపులు జరిగాయని, మిగిలినవి పురోగతి లో ఉన్నట్లు మాధవీ లత పేర్కొన్నారు.

జగనన్న భూ హక్కు రక్షా పథకం కింద 15 మండలాల పరిధిలో ఉన్న 39 గ్రామాలకు చెందిన 19,854 పట్టాలు అందాయని, వాటిలో ఇప్పటి వరకు 10058 పత్రాల ఈ కేవైసి 50.56 శాతం పూర్తి చేసినట్లు ఆమె పేర్కొన్నారు. 7,266 మందికి చెందిన పట్టాలు పంపిణీ చేశామన్నారు. జిల్లా లో 641 మంది వ్యవసాయ భూమి కోసం ధరకాస్తు చేసుకోగా, వాటిలో అర్హత గలవి 640 మంది ఎస్సీ లబ్దిదారులు గుర్తించామన్నారు. జిల్లాలో 587.07 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్నట్లు తెలియచేశారు ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, డి ఆర్వో జీ. నరసింహులు, లాండ్ సూపరింటెండెంట్ కె. శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *