– మాజీ మంత్రి మారెప్ప
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వం ప్రవేశపెట్టిన చీకటి జీవో నెంబర్ వన్ ను వెనక తీసుకోవాలని రాజ్యాంగ బద్ధ హక్కుల కోసం పోరాటం చేస్తామని ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి ఎం మారెప్ప అన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో గురువారం జరిగిన ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యవర్గ కమిటీ కి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మారెప్ప మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నామని, తెలంగాణలో ఉన్న ఏపీ ఆస్తులైన ప్రజా సొమ్మును ఏపీ ప్రభుత్వం అడగటం లేదని చెప్పారు. రాష్ట్రానికి విభజన హామీలు కేంద్రం అమలు చేయట్లేదని ధ్వజమెత్తారు. రానున్న ఎన్నికలలో బ్యాలెట్ పేపర్‌ను ఉపయోగించాలని సూచించారు. ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షులు దేవరపల్లి మహేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని, భవన నిర్మాణ కార్మికులు పనులు లేక విల విల లా, రైతంగం అష్ట కష్టాలు పడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని వెల్లడించారు. ఆస్తులు అమ్మేస్తూ, అప్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తుందని విమర్శించారు. జీవో నెంబర్ ఒకటిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరిలో ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేయుచున్నట్లు తెలియజేశారు. జాతీయ అధ్యక్షులు కెపి శ్రీధర్ మాట్లాడుతూ అంబేద్కర్ వంటి మహనీయుల ఆదర్శాలకు అనుగుణంగా పార్టీ నడుస్తుందని చెప్పారు. రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందాలని ఆ దిశగా రాజీలేని పోరాటం చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి గోగిరెడ్డి అంజలీదేవి, జాతీయ మైనార్టీ సెల్ జనరల్ సెక్రెటరీ షేక్ బాషా ఏపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జై బాబు, పి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News