విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో జరుగుతున్న వై.ఎస్.ఆర్. జగనన్న శాశ్వత భూ హక్కు- భూరక్ష వధకం వలన రైతులకు మేలు జరుగుతుందని ఆనందం కన్నా అందులో జరుగుతున్నా లోభూష్ట విధానాలతో హత్మ చేసుకునే విధంగా ఉందని రైతు సంఘాలు సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు ఆగ్రహాం వ్యక్తం చేశారు. గురువారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 100 ఏళ్ల తరువాత చేపట్టిన రీ సర్వే కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి ఈ సింహభాగం నిధులు కేంద్రము ఇస్తుంది అంతే కాకుండా కేంద్రం ఇచ్చిన స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసీజర్ విధివిధానాలు స్పష్టంగా అమలు చేసి ఎక్కడా లోటు పాట్లు జరగకూడదని ఇచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎక్కడా పాటించకపోవడంతో వేలాది మంది రైతులు సివిల్ కోర్టు మెట్లు ఎక్కె వరిస్థితి వచ్చిందన్నారు. పాస్ పుస్తకం అంటే రైతుకు స్పందించి అన్ని వివరాలు అందులో పొందువరిచి వుంటాయని 100 సం.లు అనంతరం మళ్ళీ దాని సర్వే జరుగుతుండటంతో రైతులు అనందించారని నేడు రైతులకు జీవన్మరణ సమస్యగా మారిందన్నారు. పూర్తి సర్వే పూర్తి వివరాలు పొందుపరచకుండా తొందర పెడుతున్నారు. సంవత్సరం క్రితం మొదలు పెట్టిన వాటికే ఇప్పటి వరకు పాసు వుస్తకాలు ఇవ్వలేదన్నారు. డ్రోన్ తో తీసిన వాటిలో కొంత తగ్గినా పెరిగినా రైతును కూర్చోబెట్టి మాట్లాడాలి కానీ అలా చేయడం లేదన్నారు. ఒకే ల్యాండ్ పార్సెల్ గా వచ్చినప్పుడు అందులో ఎవరెవరి భూములున్నాయో వారితో మాట్లాడి, ఒప్పించించి సంతకాలు చేయించుకోవాలి ఇవేవీ చేయడం లేదు. మూడు, నాలుగు సార్లు రైతుకు వివరించి నోటీస్ ఇవ్వాల్సింది పోయి అవేమి చేయకుండా వుస్తకాలు ఇచ్చిన తరువాత తన భూమి కరెక్ట్ గా ఉందొ లేదో తెలుసుకునే దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడిందన్నారు. ఒకసారి వుస్తకాలు ఇచ్చాక కలెక్టర్ కూడా ఏమి చేయలేరన్నారు. ఒక ఊళ్లోనే వేలాది తప్పులు తడకలు ఉన్నట్టు రైతు సంఘాల నాయకులు గుర్తించారన్నారు. కేంద్రం ఇచ్చిన ప్రొసీజర్ ప్రకారం చేస్తే ఇబ్బందులు ఉండవని చెప్పినా వినడం లేదన్నారు. ఎడిట్ ఆప్షన్ తీసుకుని మారుస్తాం అంటున్నారు. అది ఎంత వరకు సాధ్యం అని ప్రశ్నించారు. వుస్తకాల్లో తప్పులు దిద్దడానికి ఒక జీవో ఇచ్చారు కానీ అది సిసియల్ కార్యాలయంలోనే నిద్రపోతుంది అన్నారు. కేంద్రం ఇచ్చిన మార్గదర్శక సూత్రాల్లో ప్రభుత్వం ఇచ్చే వుస్తకం ఆధారిటేటివ్ బుక్ అని పేర్కొన్నారు.వుస్తకం కరెక్ట్ గా ఉంది అని ప్రభుత్వం ఇచ్చే హామీ ఇవ్పుడిచ్చే పాసు వుస్తకాలు 8 సర్వే లో జాయింట్ లో ఉన్న లో భూములకు కేంద్ర ప్రభుత్వం స్పష్టం మార్గానిర్దేశాలు చేసిందన్నారు. రైతుల సమక్షంలో డ్రోన్ ద్వారా ఫోటోలు తీసి హద్దులు గుర్తిం చాలని నిబంధన ఉంది వట్టా వుస్తకంలో ఒకరికంటే ఎక్కువ మందిని కలిగి ఉంటుంది, ఒక వుస్తకంలో 70 మంది ఉంటే అందులో భూమిం కలిగి ఉన్న రైతు లోన్ కానీ ఇతర వాటికి ఉపయోగించుకోవాలి అంటే మిగతా 70 మంది అనుమతి తప్పనిసరి ప్రభుత్వమే చేవుతుందన్నారు. ఈ వుస్తకాల పై బ్యాంక్ లోన్ తీసుకోవాలంటే ఆ వుస్తకం బ్యాంక్ అధికారికి చూపించాల్సిన అవసరం లేదని ప్రభుత్వమే చెప్తుంటే ఇంకా దానికి విలువ ఏముంటుందన్నారు. రైతాంగ సమాఖ్య అధ్యక్షులు యెర్నేని నాగేంద్రనాధ్ మాట్లాడుతూ ఇప్పటికే 8 లక్షల వుస్తకాలు ప్రింట్ అయినట్టు ప్రభుత్వం గెజిట్ విడుదల చేసిందన్నారు. సర్వే పూర్తయిందని ఇచ్చిన గెజిట్లపై ఏమన్నా సమస్యలు ఉంటే కోర్టుకు వెళ్ళడం తప్ప వేరే దిక్కులేదన్నారు. గ్రామ సభలు నిర్వహిం చామని, వం చాయితీ నోటీస్ బోర్డ్ లలో పెట్టామని చెప్తున్నారు కాని ఎక్కడా ఆ విధంగా చేయలేదన్నారు. భూ హక్కు భూ రక్ష అని చెప్పి ఉన్న హక్కులు తీసేసారన్నారు. వాటిల్లో అనేక సరిదిద్దలేని తప్పులున్నాయి. తహసేల్దారు దృష్టికి తీసుకెళ్లినా అధికారులు చేతులు ఎత్తేస్తున్నారన్నారు. తప్పులు సరి చేస్తామని మాయమాటలు చెప్పి వేలు ముద్రలు వేయించుకుంటున్నారు,ఇదే విధంగా వ్యవహరిస్తే రైతులు తిరగబడే రోజులు దగ్గర ఉన్నాయి,ఇప్పటికైనా తప్పులు సరిచేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు కె. కేశవరావు, ఆళ్ళ వెంకట గోపాల కృష్ణ, చుండూరి రంగారావు, కుర్రా నరేంద్ర,శివానంద్,తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News