విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే జైనులు గురువారం ఝార్ఘండ్ లోని పరమ పవిత్రమైన “శిఖర్ జీ” ఆలయ పవిత్రతను కాపాడుకొనే నిమిత్తం ఝార్ఙండూ ప్రభుత్వంపై నిరసన తెలుపుతూ నినదించారు. విజయవాడ లోని జైనులందరూ ఆడవారితో సహా కలసి గురువారం తుమ్మలపల్లి కళాచేత్రం నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు సేవ్ శిఖర్ఙీ అంటూ నినదిస్తూ ర్యాలీగా వెళ్ళి సబ్ కలెక్టరు కి వినతి పత్రం ఇచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ తమ 24 తీర్థంకరులలో 20 మంది తీర్దంకరులు మోక్షం పొందిన జైనాలయం ను పవిత్రంగా చూసుకుంటామన్నారు. తాము ఉపవాసముండి చెప్పులు లేకుండా నడచి పవిత్రంగా చూసుకునే జైనాలయం టూరిస్టు రిసార్ట్ చెయటం తమని ఎంతో వేదిస్తుందని తక్షణమే ఝార్ఘండ్ ప్రభుత్వం ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలని కోరారు. ఝార్ఘండ్ ప్రభుత్వ చర్యను దుయ్యబట్టారు. జైనులందరూ తమ పిల్లలు కుటుంబాలతో సహా ర్యాలీలో పాల్గొనటం ప్రజలు ఆసక్తి గా గమనించారు. ఈ కార్యక్రమంలో పన్నాలాల్ జి, ప్రవీణ్ రాంకా, మహీంద్రా జైన్, సంజయ్ జైన్, దినేష్ జైన్, జితేంద్ర జైన్, మానేష్ జైన్, మిల్టన్ జైన్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News