-డీటీసీ యం పురేంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతీఒక్కరూ క్రీడా స్ఫూర్తిని కలిగిఉండాలని, విధి నిర్వహణలో నిత్యం కుస్తీపడుతూ మానసిక ఒత్తిడికి గురైయ్యే, ఉద్యోగులకు క్రీడలు ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తాయని డీటీసీ యం పురేంద్ర అన్నారు.
గురువారంనాడు స్థానిక బందరు రోడ్డులోని డీటీసీ కార్యాలయ ప్రాంగణంలో రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షుడు యం రాజుబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్యాడ్మింటన్ కోర్టును డీటీసీ యం పురేంద్ర ప్రారంభించారు.
ఈ సందర్భంగా డీటీసీ యం పురేంద్ర మాట్లాడుతూ వయస్సుతో సంబంధం లేకుండా ఉద్యోగులందరు వారికి ఆసక్తి ఉన్న క్రీడాలలో పాల్గొని మానసిక ఉల్లాసాన్ని, ఆరోగ్యాన్ని పొందాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా క్రీడాభివృద్ధిని ఎంతగానో ప్రోత్సాహాన్నిస్తోందని ఆయన పేర్కొన్నారు. మనిషి సాగించే జీవన ప్రయాణంలో ఎన్నో ఒత్తిడి ల మధ్య ఒడిదొడుకులను ఎదుర్కొంటూ, మారుతున్న కాలానికి అనుగుణంగా విధులు నిర్వర్తిస్తున్నారు. కానీ వ్యక్తిగత ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఈ నిర్లక్షమే మనిషిపాలిట శాపంగా మారుతుందన్నారు. తాజా సర్వేలు దాదాపు 70 శాతం ఆరోగ్య సమస్యలు కేవలం ఒత్తిడి వల్లే వస్తున్నట్లు తేల్చాయని డీటీసీ చెప్పారు. ఆటల ద్వారా ఉపశమనం పొంది ఆరోగ్యంను కాపాడుకోవాలని డిటిసి కోరారు.
రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షుడు యం రాజుబాబు మాట్లాడుతూ అధికారులు ఉద్యోగుల మధ్య పరస్పరం స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పించేందుకు, కలిసిమెలిసి పనిచేసేందుకు ఈ ఆటలు దోహదపడతాయని అన్నారు. ఉద్యోగులలో ప్రతిభను మెరుగు పర్చుకొనేందుకు ఆటలు పోటీలు దోహద పడతాయన్నారు. రానున్న రోజుల్లో ఆటల పోటీలను కూడా నిర్వహించేలా డీటీసీ పురేంద్ర తో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉదయం సాయింత్రం సమయాలలో కొంత సమయాన్ని ఆటలకు కేటాయించాలన్నారు. ఉద్యోగులు ఆటలు ఆడుకొని, శారీరక దృక్పధాన్ని పెంపొందించు కొనే విధంగా బ్యాడ్మింటన్ కోర్టును డీటీసీ పురేంద్ర ప్రోత్యాహంతో నిర్మించడం జరిగిందన్నారు. అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియ జేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్టీవో ఆర్ జగదీశ్వర్ రాజు, మోటార్ వాహన తనిఖీ అధికారులు ఆర్ ప్రవీణ్, ఎస్ శ్రీనివాస్, బి చల్లారావు, కార్యాలయం అధికారులు అబ్దుల్ సత్తార్ ఉద్యోగ సంఘ నాయకులు యం రాజుబాబు, యం ఆనంద్ కుమార్, కెవివి నాగమురళి, ఉద్యోగులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News