మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ, రాష్ట్ర రహదారుల ప్రాధాన్యతను గుర్తించాలని భూసేకరణ, పరిహారం చెల్లింపులు చేపట్టి రహదారుల నిర్మాణాల వేగవంతానికి చర్యలు చేపట్టాలని రాష్ట్ర రోడ్డు రవాణా, ఆర్ అండ్ బి ప్రిన్సిపల్ సెక్రటరీ పి.ఎస్.ప్రద్యుమ్న సూచించారు. గురువారం మద్యాహ్నం అమరావతి నుండి రాష్ట్ర రోడ్డు రవాణా ఆర్ అండ్ బి ప్రిన్సిపల్ సెక్రటరీ అన్ని జిల్లాల కలెక్టర్లతో, జాయింట్ కలెక్టర్ లతో ఎన్.హెచ్.ఎ.ఐ. , ఆర్ అండ్ బి అధికారులతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించగా మచిలీపట్నం కలెక్టర్ చాంబర్ లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా కృష్ణాజిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా, జాయింట్ కలెక్టర్ డాక్టర్. అపరాజిత సింగ్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పి.ఎస్.ప్రద్యుమ్న మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల నిర్మాణాలకు సరిపడా నిధులు అందుబాటులో ఉన్నాయని భూసేకరణ, పరిహారాల చెల్లింపు పూర్తి చేసి ప్రారంభంకాని రహదారులను ప్రారంభించాలని, పురోగతిలో ఉన్న రహదారులు వేగవంతం చేయాలని సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా మాట్లాడుతూ, జిల్లాలో జాతీయ రహదారులను మెరుగుపరిచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమైనదని తెలిపారు. జిల్లా కేంద్రం మీదుగా ఎన్ హెచ్ 9, ఎన్ హెచ్ 5 , 214 ఏ తదితర జాతీయ రహదారులు కొనసాగుతున్నాయని వివరించారు. భూ సేకరణ కార్యక్రమం వేగవంతం చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ వీడియో కాన్ఫెరెన్స్ లో ఎన్.హెచ్.ఎ.ఐ., ఆర్ అండ్ బి శాఖల అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News