-పనుల్లో నాణ్యాత లేకుంటే బిల్లులు చెల్లించం,
-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
23 డివిజన్ సి.వి.ఆర్ హై స్కూల్ లో నాడు-నేడు పనుల క్రింద రూ.150 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మాణo పూర్తి అయిన భవనన్ని, నగరంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న పలు ఆధునీకరణ పనులను నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ గురువారం ఇంజనీరింగ్ అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పనులను పరిశీలించినారు. అభివృద్ధి పనులల్లో నాణ్యతా ప్రమాణాలు ఎలా ఉన్నాయో పూర్తిస్థాయిలో పరిశీలించినారు. పనుల్లో నాణ్యాత ప్రమాణాలు ఉంటేనే గుత్తేదార్లకు బిల్లులు చెల్లిస్తామని కమిషనర్ తెలిపారు. తదుపరి 62 మరియు 64 వ డివిజన్లలో ఉన్న టెండర్స్ లో ఉన్న ఫైల్స్ సంబందించి డ్రైనేజీలను పరిశీలించినారు. పర్యటనలో డిప్యూటీ ఎగ్గిక్యుటివ్ ఇంజనీర్ గురునాద్, మరియు ఇతర అధికారులు కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News