-13 పరీక్ష కేంద్రాల్లో హాజరుకానున్న 6431 మంది అభ్యర్థులు..
-13 మంది లైజనింగ్ అధికారులు, 13 మంది ఛీఫ్ సుపరిండెంటెంట్లు..
-ఉదయం 9 గంటలకే అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి..
-హాల్ టిక్కెట్‌తో పాటు ఫోటో తో ఉన్న ఎదైన ఒరిజనల్ ఆధార్, పాస్‌పోర్టు –
-డ్రైవింగ్లైసెన్స్ రేషన్‌కార్డు, ఓటర్కార్డులను తమతోపాటు తప్పనిసరిగా తీసుకురావాలి..
-అభ్యర్థులు మొబైల్ ఫోన్స్, క్యాలిక్యూలెటర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష కేంద్రానికి తీసురావద్దు..
-జిల్లా కలెక్టర్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా ఈనెల 8వ తేది ఆదివారం నిర్వహించనున్న గ్రూప్`1 స్కీృనింగ్ పరీక్షకు పటిష్ట ఏర్పాట్లు చేసి కేంద్రాలను సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అధికారులను ఆదేశించారు.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ఏపిపిఎస్సి గ్రూప్`1 ప్రిలిమినరీ పరీక్షకు చేపట్టవలసిన ఏర్పాట్లపై గురువారం నగరంలోని కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 8వ తేది ఆదివారం నగరంలోని 13 కేంద్రాలలో పరీక్షను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం10.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు తిరిగి మధ్యాహ్నం 2.00 గంటల నుండి సాయంత్రం 4.00 గంటల వరకు అఫ్లైన్, ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ పరీక్షకు 6,431 మంది అభ్యర్థులు హాజరుకానున్నారన్నారు. పరీక్షల సక్రమ నిర్వహణకు ప్రతి కేంద్రానికి జిల్లా స్థాయి సీనియర్ అధికారులను 13 మంది లైజన్ అధికారులుగా నియమించామని వీరంతా ఆయా కేంద్రాలను తనిఖీ చేసి పరీక్ష నిర్వహణకు అవసరమయ్యే వసతులు, సౌకర్యాలను పరిశీలించాలన్నారు. 13 మంది ఛీఫ్ సుపరిండెంటెంట్లగా నియమించామన్నారు. పరీక్షల మెటీరియల్‌ను కేంద్రాలకు తరలించేందుకు వీలుగా లైజన్ అధికారులకు ఇద్దరు ఆర్మడ్ పోలీస్ పర్సన్స్‌ను ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. అభ్యర్థులు హాల్‌టిక్కెట్‌తో పాటు పోటోతో ఉన్న ఏదైన ఒరిజనల్ ఆధార్‌కార్డు, డ్రైవింగ్లైసెన్స్, ఓటర్‌కార్డు, పాస్‌పోర్టు, రేషన్‌కార్డు, ఐడి గుర్తింపు కార్డులను తప్పకుండా తమతో తీసుకురావాలన్నారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి ఉదయం 9 గంటలకే చేరుకోవాలని, ఉదయం 9.45 తరువాత మధ్యాహ్నం పరీక్షకు 1.45 తరువాత అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోనికి అనుమతించడం జరగదని కలెక్టర్ స్పష్టం చేశారు. అభ్యర్థులు మొబైల్ ఫోన్స్, క్యాలిక్యూలెటర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష కేంద్రానికి తీసురాకుండా ముందుగానే తెలపాలన్నారు. నగర పరిధిలోని తూర్పు పశ్చిమ సెంట్రల్ నియోజకవర్గల పరిధిలోని పరీక్ష కేంద్రాల వద్ద సంబంధిత తహాశీల్థార్లు 144 సెక్షన్ అమలు చేసే విధంగాను పరీక్ష కేంద్రాల పరిసరాలలో ఇంటర్నెట్, జిరాక్సు సెంటర్లు ముసివేసేలా ఆదేశించామన్నారు. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పరీక్ష కేంద్రాల వద్ద నిరంతర విద్యుత్తు సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఏపిసిపిడిసిఎల్ అధికారులను ఆదేశించారు. సీనియర్ ఏఎన్యంలతో కూడిన మెడికల్ సిబ్బంది, అత్యవసర మందులతో మెడికల్ కాంప్‌ను ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టరేట్లో ఈనెల 6వ తేది నుండి 8వ తేది వరకు అధికారులతో సమన్వయం చేసేలా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలన్నారు. ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా అందరి సమన్వయంతో ఈ పరీక్షలను విజయవంతం చేయాలని కలెక్టర్ డిల్లీరావు అధికారులను కోరారు. సమావేశంలో డిఆర్వో కె. మోహన్‌కుమార్, ఏసిపి యం. సత్తిబాబు, ఏపిపిఎస్సి కోఆర్డినేటర్ ఎస్ నాగూర్ షరీఫ్, జిల్లా లైజన్ అధికారులు, ఛీఫ్ సూపరిండెంటెంట్లు ఉన్నారు.
Prajavartha Online Telugu News