-సుమారు 40 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యే అవకాశం
-మొత్తం 300 మందికై పైగా జాతీయ,అంతర్జాతీయ ప్రనిధులు హాజరయ్యే అవకాశం
-రాష్ట్రాన్ని,విశాఖ నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేసేందుకు కృషి
-విశాఖలో జరిగే వర్కింగ్ గ్రూప్ సమావేశానికి విస్తృత ఏర్పాట్లు
-మున్సిపల్ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మార్చి 28,29 తేదీల్లో రెండు రోజుల పాటు విశాఖపట్నంలో జి-20 దేశాల వర్కింగ్ గ్రూపు సమావేశం జరగనుందని రాష్ట్ర మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి వెల్లడించారు.ఈ జి-20 దేశాల వర్కింగ్ గ్రూపు సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లపై శుక్రవారం అమరావతి సచివాలయంలో సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమీక్షించారు.అనంతరం మరో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడుతూ మార్చి 28,29 తేదీల్లో విశాఖపట్నంలో జి-20 దేశాల వర్కింగ్ గ్రూప్ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆతిధ్యమిస్తోందని తెలిపారు. ఈసమావేశంలో జి-20 దేశాలైన అర్జెంటీనా,ఆస్ట్రేలియా,బ్రెజిల్,కెనడా,చైనా,ఫ్రాన్స్,జెర్మనీ, ఇండియా,ఇండోనేషియా,ఇటలీ,జపాన్,రిపబ్లిక్ ఆఫ్ కొరియా,మెక్సికో, రష్యా,సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా,టర్కీ,ఇంగ్లాండు,ఆమెరికా దేశాల తోపాటు యూరోపియన్ యూనియన్ లోని మరో 19 సభ్య దేశాలు ఈ జి-20 వర్కింగ్ గ్రూప్ సమావేశాల్లో పాల్గోనున్నాయని స్పెషల్ సిఎస్ శ్రీలక్ష్మి వివరించారు.ఈసమావేశానికి సుమారు 300 మంది వరకూ వివిధ దేశాల ప్రతి నిధులు,కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ప్రతినిధులు,అధికారులు పాల్గొంటారని తెలిపారు. సుమారు 40 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరు కానున్న నేపధ్యంలో ప్రతి బృందానికి ముగ్గురు నుండి నలుగురు ట్రాన్సులేటర్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
ఈజి-20 వర్కింగ్ గ్రూప్ సమావేశం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ వినూత్న పధకాలు,కార్యక్రమాలను అనగా గ్రామ,వార్డు సచివాలయాలు,రైతు భరోసా కేంద్రాలు,డిజిటల్ లైబ్రరీలు,నాడు నేడు కింద చేపట్టిన వివిధ వినూత్న కార్యక్రమాలు ఇతర విధానాలతో పాటు రాష్ట్రానికి సంబంధించి ఆర్ట్స్ అండ్ కల్చర్ ను ప్రదర్శించడం(షోకేసింగ్) తోపాటు సుందర విశాఖ నగరానికి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేయనుందని స్పెషల్ సిఎస్.శ్రీలక్ష్మి స్పష్టం చేశారు.కోవిడ్ ప్రోటోకాల్ నిబంధనలను ఖచ్చింతగా పాటిస్తూ ఈసమావేశాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.ఈసమావేశం నేపధ్యంలో విశాఖనగరంలోని రహదార్లన్నిటినీ సర్వాంగ సుందరంగా తీర్దిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు ఆమె పేర్కొన్నారు.
రెవెన్యూ మరియు ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ మాట్లాడుతూ ఈ జి-20 వర్కింగ్ గ్రూప్ సమావేశాలు సందర్భంగా మన రాష్ట్రానికి సంబంధించిన సంస్కృతి, పర్యాటక రంగాల ప్రాముఖ్యతను ముఖ్యంగా విశాఖ పరిసర ప్రాంతాల పర్యాటక ప్రాముఖ్యతను తెలియజేసేందుకు పెద్దఎత్తున చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు.అరకు ప్రాంత అందాలు వాటి ప్రాముఖ్యత,సుందరమైన బీచ్ లు తదితర పర్యాటక,సాంస్కృతిక ప్రాంతాల ప్రాముఖ్యతను జాతీయ అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేయనున్నట్టు తెలిపారు.
సమాచారశాఖ కమీషనర్ టి.విజయకుమార్ రెడ్డి మాట్లాడుతూ విశాఖలో జరగనున్న జి-20 దేశాల వర్కింగ్ గ్రూప్ సమావేశం సందర్భంగా మీడియాకు ప్రత్యేక మీడియా లాంజ్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.వివిధ జాతీయ,అంతర్జాతీయ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు సోషల్ మీడియా,ఇతర అవుట్ డోర్ మీడియాల ద్వారా ప్రసారం తోపాటు ఆంధ్రప్రదేశ్ తోపాటు విశాఖ నగర ప్రాముఖ్యతను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేసేందుకు విస్తృత ప్రచారానికి చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు.అంతేగాక ఈవర్కింగ్ గ్రూప్ సమావేశం సందర్భంగా మీడియాకు ప్రెస్ కాన్పరెన్సులు ద్వారా సకాలంలో మీడియాకు సమాచారం అందించేందుకు కృషి చేయడంతో పాటు సమావేశానికి వచ్చిన వివిద ప్రతినిధులతో మాట్లాడించడం జరుగుతుందని చెప్పారు.
విశాఖలో జరిగే జి-20 దేశాల వర్కింగ్ గ్రూప్ సమావేశానికి విస్తృత ఏర్పాట్లు:స్పెషల్ సిఎస్
మార్చి28,29 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్నజి-20 దేశాల వర్కింగ్ గ్రూప్ సమావేశానికి సంబంధించి విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు రాష్ట్ర మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి చెప్పారు.ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై శుక్రవారం అమరావతి సచివాలయం రెండవ బ్లాకులో ఆమె సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.ఈసందర్భంగా ఆయా శాఖల వారీగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై ఆమె సమీక్షిస్తూ విశాఖ నగరంలో రహదార్లు,నగర సుందరీకరణ,గ్రీనింగ్,విద్యుదీకరణ,సైనేజెస్, పారిశుద్ద్యం,వేదిక,వసతి ఏర్పాట్లపై జిఏడి,విశాఖ కలక్టర్,ఆర్అండ్బి,వియంఆర్డిఏ,జివిఎంసి కమీషనర్లకు తగిన ఆదేశాలు జారీ చేశారు.అలాగే సమావేశానికి వచ్చే దేశ విదేశీ ప్రతి నిధులకు ప్రోటోకాల్,రవాణా ఏర్పాట్లపై విశాఖ కలక్టర్,జిఏడి,రవాణా శాఖల అధికారులకు, పార్టిసిపేషన్ ఏర్పాట్లపై జిఏడి,ఐటి అండ్ సి,విశాఖ జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు.హెల్తు అండ్ కోవిడ్ సేప్టీ ప్రోటోకాల్ పై వైద్య ఆరోగ్యశాఖ,జిల్లా యంత్రాంగాలు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.సెక్యురిటీ మరియు పార్కింగ్ ఏర్పాట్లకు సంబంధించి పోలీస్ శాఖ,జిల్లా యంత్రాగానికి తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా స్పెషల్ సిఎస్ శ్రీలక్ష్మి ఆదేశించారు. ఇంకా టూరిజం మరియు కల్చర్,మీడియా కవరేజ్,ప్ర్రోగ్రామ్ పార్ములేషన్,కేటరింగ్,పుడ్ అండ్ బేవరేజెస్ అంశాలకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లపైన ఆమె ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు.
ఈసమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి,రజత్ భార్గవ,సమాచారశాఖ కమీషనర్ టి.విజయకుమార్ రెడ్డి,జివియంసి కమీషనర్ పి.రాజబాబు,రవాణాశాఖ సంయుక్త కమీషనర్ వెంకటేశ్వరరావు,రాష్ట్ర ప్రోటోకాల్ విభాగం సంచాలకులు సుబ్రహ్మణ్యం రెడ్డి,ఎపి గ్రీనింగ్ కార్పొరేషన్ చెందిన రాజశేఖర్ రెడ్డి,ఎపి ఎన్ఆర్టికి చెందిన వెంకట్,పరిశ్రమల శాఖ స్పెషల్ సెక్రటరీ సుందర్ తదితరులు పాల్గొనగా వీడియో లింక్ ద్వారా టిఆర్ అండ్ బి కార్యదర్శి ప్రద్యుమ్న,విశాఖపట్నం జిల్లా కలక్టర్ ఎ.మల్లిఖార్జున,విశాఖ పోలీస్ కమీషనర్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News