Breaking News

జిఒ నెంబర్ ఒన్ తెచ్చి మీ తప్పులను దాయలేరు… : పోతిన వెంకట మహేష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర అధికార ప్రతినిధి విజయవాడ నగర అధ్యక్షులు మరియు పశ్చిమ నియోజకవర్గం ఇన్చార్జ్ పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ ఎపిని సర్వ నాశనం‌ చేసేందుకే వైసిపి పుట్టిందని, పండుగ చేసుకునేందుకు కనీస డబ్బులు లేక పేదలు నరకం‌ చూస్తున్నారని, జగన్ పాలనలో సామాన్యులు కు ఆత్మహత్య లే శరణ్యం అనేలా చేశారని, ప్రజలు బయటకి వచ్చి తమ ఆవేదన చెప్పినా పట్టించుకోవడం లేదని, జిఒ నెంబర్ ఒన్ తో ఎపి లో ప్రజా స్వామ్యం ఖూనీ అయ్యిందని, ఈ అంశాల పైనే నేడు‌ చంద్రబాబు తో మా పవన్ కళ్యాణ్ కలిశారని, వైసిపి పార్టీ  పవన్ కళ్యాణ్ పై విషం చిమ్ముతున్నారని, పదేపదే పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తున్నారంటే వారికి వణుకు పుడుతుందని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిశారంటే… వైసిపి వాళ్లకు చలి, జ్వరం వస్తున్నాయని, మేము వారాహి అని పేరు పెడితే… వైసిపి పార్టీవారు తమకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని, ఇక వారాహి రోడ్ మీదకు వస్తే… ఫ్యాంట్లు తడుపుకుంటారని, నోరు పారేసుకుంటున్న వైసిపి నాయకులకు ఆంజనేయుని తాయిత్తులు పంపుతామని, జగన్ తన కేసుల కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాల ను తాకట్టు పెట్టారని, ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసి అప్పుల ప్రదేశ్ గా మార్చారని, కేసిఆర్ దత్త పుత్రుడు జగన్… అందుకే ఇక్కడ నాశనం చేసి.. అక్కడ అభివృద్ధి కి సహకరించారని, వైసిపి చేసే అవినీతి, అక్రమాలను ప్రశ్నించ కూడదని ?జిఒ నెంబర్ ఒన్ తెచ్చి మీ తప్పులను దాయలేరని, ఇది భావ ప్రకటన స్వేచ్చను హరించడమేనని  అన్నారు. అంబటి‌, అమర్‌నాథ్, నాగేశ్వరరావు లు జగన్ చెప్పు చేతల్లో పని చేసే మంత్రులు అని, మీ శాఖలో ఏం జరుగుతుందో కనీసం అవగాహన లేని‌మీరుమా మీద విమర్శలు చేస్తారా.. అంటే మీకు భయం ఉన్నట్లే కదా అని, అధికారం అడ్డం పెట్టుకుని అవాస్తవాలు మాట్లాడితే ప్రజలు చూస్తూ ఊరుకోరని, ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి, నియంత పాలన పై వారు చర్చ చేసి ఉండవచ్చుఅని, పొత్తులు అవసరమైతే పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకుని ప్రకటిస్తారని ,మీకెందుకు అంత తొందర… ఆవేశంతో ఊగి పోతున్నారని, వెల్లంపల్లి నీకు మతి సరిగా ఉందా లేదా ఆస్పత్రి లో‌ చూపించుకోవలని, మసాజ్ ల కల్చర్ వెల్లంపల్లి దే కాబట్టి.. ఆయనకి అవే గుర్తు వస్తాయని, నోరు అదుపులో పెట్టుకో… లేదంటే నీ మసాజ్ అమ్మాయిల వివరాలు బయట పెడతానని, పవన్ కళ్యాణ్ పేరు చేబితేనే‌ మీరంతా వణికి పోతున్నారని, వచ్చే ఎన్నికలలో నా చేతిలోనే వెల్లంపల్లి కి ఓటమి ఖాయం మని మహేష్ హెచ్చరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *