Breaking News

ఇంధన సామర్థ్యం లో ఏపీ ను ఒక నమూనాగా ఆవిష్కరిస్తాం… : బీఈఈ

-ఎనర్జీ ఎఫిసిఎన్సీ ఫైనాన్సింగ్ ప్రాజెక్టులకు… వైజాగ్ వేదిక వేడుకయింది
-రూ 412 కోట్ల పై బడిన ఇంధన సామర్ఢ్య పెట్టుబడులకు గట్టి పునాది పడింది
-కేంద్ర ప్రభుత్వ సంస్థ బీఈఈ
-దశలవారీగా భవిష్యత్తు లో ఇంధన సామర్ధ్య ప్రాజెక్టులకు బీఈఈ సాయం
-దేశ లక్ష్యాలను చేరుకోవడానికి ఫాస్ట్ ట్రాక్ పద్దతి అవలంభించాలి
-2030 నాటికి 150 మిలియన్ టన్నుల చమురు సమాన నిల్వ ఆదా చేయాలని సూచన
-2031 నాటికి రూ. 10 లక్షల కోట్ల ఇంధన పొదుపు లక్ష్యం
-ఇంధన సామర్ధ్య కార్యక్రమాల అమలు లో ఆంధ్ర ప్రదేశ్ అత్యుతమ రాష్ట్రాలలో ఆంధ్ర ప్రదేశ్ ఒకటి
-బీఈఈ డైరెక్టర్ జనరల్ అభయ్ భాక్రే

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ర్టంలో ఎనర్జీ ఎఫిసిఎన్సీ ఫైనాన్స్ ప్రాజెక్టులను భవిష్యత్తు లో దశలవారీగా సాకారం చేయటానికి సంపూర్ణంగా సహకరిస్తామని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిసిఎన్సీ (బీఈఈ) హామీ ఇచ్చింది. దేశంలో అన్ని రాష్ట్రాలకంటే ముందుగా ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ డేసిగ్నేటేడ్ ఏజెన్సీ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ , ఇంధన శాఖ , ఇంధన సామర్ధ్య పెట్టుబడులను ఆకర్షించేందుకు విశాఖ లో నిర్వహించిన ఇన్వెస్ట్మెంట్ బజార్ సదస్సు సత్ఫలితాలను ఇచ్చిందని బీఈఈ పేర్కొంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిసిఎన్సీకి చెందిన ఆర్థిక సాంకేతిక నిపుణులతో కూడిన ఫెసిలిటేషన్ సెంటర్ గుర్తించిన రూ 412 కోట్లకు పైబడిన పెట్టుబడులకు ఆస్కారం ఉన్న ఎనర్జీ ఎఫీషియన్సీ ఫైనాన్స్ ప్రాజెక్టులను భవిష్యత్తు లో దశలవారీగా సాకారం చేస్తామని స్పష్టంచేసింది.

ఏపీలోని విశాఖ కేంద్రంగా నిర్వహించిన సదస్సులో పరిశ్రమలు, బ్యాంకులు నుంచి వచ్చిన పలువురు ప్రతినిధులు తమ విలువైన సూచనలను అందించడం బీఈఈ చేపట్టిన ప్రక్రియకు బలం చేకూరిందని, దేశవ్యాప్తంగా ఎనర్జీ ఎఫిసిఎన్సీ ప్రాజెక్టులు వాస్తవ రూపం దాల్చడానికి ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసినట్లు బీఈఈ డైరెక్టర్ జనరల్ అభయ్ బాక్రే వెల్లడించారు. నూతన సంవత్సరం సందర్భంగా ఇంధన పొదుపు , సమర్థ వినియోగం , సామర్థ్యం పెంపు కు సంబంధించి అనేక కార్యక్రమాలను ఆదివారం ఆయన వెబినార్ ద్వారా సమీక్షించారు . కేంద్ర ప్రభుత్వ పాలిత ప్రాంతాలతో సహా దాదాపు 30 రాష్ట్రాల స్టేట్ డేసిగ్నేటేడ్ ఏజెన్సీలు పాల్గొన్న ఈ వెబినార్ లో ఆయన ఈ సంవత్సరానికి సంబంధించి ఇంధన సామర్ధ్య పైలట్ ప్రోజెక్టుల సత్వర నిర్వహణకు రాష్ట్రాలకు దశదిశా నిర్దేసించారు. ఈ సందర్భంగా ఆయన అందరికీ నూతన సంవత్సర 2023 శుభాకాంక్షలను తెలియజేశారు.
అనంతరం మాట్లాడుతూ, జాతీయ ఇంధన సామర్థ్య లక్ష్యాలను చేరుకోవడానికి మరియు వాతావరణ మార్పులను పరిష్కరించడానికి, కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) అన్ని రాష్ట్రాలకు 2030 నాటికి 150 మిలియన్ టన్నుల చమురు సమానమైన (ఎంటీఓఈ)ను త్వరితగతిన ఆదా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇంధన సామర్థ్య కార్యక్రమాలు మరియు దేశ ఆర్థిక వ్యవస్థపై ఉద్గారాల తీవ్రతను తగ్గించడం ద్వారా సమగ్ర అభివృద్ధిని సాధించేందుకు అన్ని రాష్ట్రాలు దూకుడుగా అమలు చేయాలని పిలుపునిచ్చింది.

దేశంలోని పారిశ్రామిక, వాణిజ్య, గృహ, రవాణా, మునిసిపల్ మరియు వ్యవసాయ రంగాలతో సహా కీలక రంగాలలో 2031 నాటికి దాదాపు రూ.10 లక్షల కోట్ల భారీ ఇంధన పొదుపు పెట్టుబడి సామర్థ్యాన్ని ఉపయోగించుకునేలా ప్రణాళికలను రూపొందించాలని ఎస్డీఏలను కోరారు. ఇప్పటి వరకు సాధించిన ఇంధన పొదుపు నివేదిక మరియు వివిధ రంగాలలో ఇంధన వినియోగ విధానం ఆధారంగా బీఈఈ అన్ని రాష్ట్రాలకు రాష్ట్ర ఇంధన పొదుపు లక్ష్యాలను నిర్ణయించిందని చెప్పారు. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ ఆంధ్రప్రదేశ్కి 6.68 ఎంటీఓఈ ఇంధన పొదుపు లక్ష్యాన్ని నిర్దేశించిందన్న ఆయన ఈలక్ష్యాన్ని సాధించడానికి రంగాల వారీగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఏపీ ఎస్డీఏ గా ఉన్న ఏపీఎస్ఈసీఎంకు సూచించారు.

ఇంధన పొదుపు, ఇంధన సామర్ధ్య కార్యక్రమాలలో ఉత్తమ పనితీరు, విధానాలను అవలంబించినందుకు గాను ఇటీవల భారత రాష్ట్రప్రతి చేతుల మీదుగా జాతీయ ఇంధన సంరక్షణ అవార్డును రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్( ఏపీఎస్ఈసిఎం ) గెలుచుకోవటం ప్రశంసనీయమన్నారు. దేశంలో ఇంధన సామర్ధ్య కార్యక్రమాల అమలు లో అత్యుతమ రాష్ట్రాలలో ఆంధ్ర ప్రదేశ్ ఒకటని అభయ్ బాక్రే కొనియాడారు. ఇంధన సామర్థ్యం లో ఆంధ్ర ప్రదేశ్ ను ఒక నమూనా గా ఆవిష్కరిస్తామని ఆయన తెలిపారు

దేశంలో 2030 నాటికి తక్కువ ఉద్గారాలు మరియు అధిక ఆర్థిక వృద్ధికి దోహదపడే విధంగా ఇంధన సామర్థ్యాన్ని పెంచడానికి బీఈఈ కట్టుబడి ఉందని బిఈఈ డైరెక్టర్ చెప్పారు. . ఇంధన సామర్థ్యం అనేది అన్ని రాష్ట్రాల్లోనూ ఇంధన భద్రతను సాధించడంలోనూ, ఆర్థిక వ్యవస్థలను విస్తరించడంలోనూ, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చుకోవడంలోనూ, ఇంధన వినియోగాన్ని తగ్గించడంలోనూ, గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడంలోనూ, పర్యావరణాన్ని రక్షించడంలోనూ ఎంతగాఓ దోహద పడుతుందన్నారు. ఈ క్రమంలో జాతీయ లక్ష్యాలను అందుకునేలా ప్రతి రాష్ర్టం తమకు నిర్దేశించిన ఇంధన సామర్ధ్య కార్యక్రమాలను చేరుకునేందుకు ఫాస్ట్ ట్రాక్ పద్దతిలో పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సహాయంతో ఇంధన సామర్థ్యం ప్రభావం,
వాతావరణ మార్పుల దుష్పరిణామాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలన్నారు. అలాగే ఇంధన సామర్థ్య కార్యక్రమాలను అమలు చేయాలని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ మరియు కేంద్ర ఇంధన శాఖ సెక్రటరీ అలోక్ కుమార్ పట్టుబట్టారని డీజీ తెలిపారు. ఈ చర్యలు వాతావరణ మార్పుల పరిష్కారానికి 50 శాతం దోహదం చేస్తాయని చెప్పారు.

భవిష్యత్తులో ఇంధన భద్రతను నిర్ధారించడానికి మరియు భవిష్యత్తు ఇంధన డిమాండ్ను తీర్చడానికి అత్యంత ప్రభావవంతమైన విధానాలలో ఒకటిగా ఇంధన సామర్థ్యం నిలుస్తుందన్నారు. అందుకోసం భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా మార్చడానికి అన్ని రాష్ట్రాల నుండి నిరంతర ప్రయత్నాలు మరియు సమగ్ర విధానం చాలా కీలకమని చెప్పారు. ఇంధన సామర్ధ్య పైలట్ ప్రాజెక్టుల అమలు త్వరితగతిన చేపట్టాలని అన్ని ఎస్డీఏలకు సూచించారు. వీటిలో ముఖ్యంగా ఆసుపత్రులు, పర్యాటక శాఖ, అంగన్వాడీలు, పాఠశాల, కళాశాల హాస్టళ్లు, ప్రభుత్వ విభాగాలు, క్యాంటీన్ల వంటి చోట్ల ఎలక్ట్రిక్ వంటపై ప్రాజెక్టులు ఉండేలా ఏర్పాట్లు చేయొచ్చన్నారు..

సాంకేతిక మరియు పరిశోధనా సంస్థలతో విస్తృతస్థాయి సంప్రదింపులు జరిపి వినూత్న ఇంధన సామర్థ్య ప్రతిపాదనలను బీఈఈకి సమర్పించడానికి ముందుకు రావాలని ఎస్డీఏలను ఆయన సూచించారు. వివిధ సంస్థల్లో ఇంధన సామర్థ్య పైలట్ ప్రాజెక్ట్లు రూపొందించాలన్నారు. పరిశ్రమలు, ఇతర సంస్థలలో పంపులు, ఫర్నేసులు, మోటార్లు మొదలైన వాటిని ఇంధన సామర్ధ్య ఉపకరణాలుగా మార్చే అవకాశముందన్నారు. ఎస్డీఏలు ప్యాక్ హౌస్లతో సహా కోల్డ్ చైన్ సెక్టార్లో పైలట్ ప్రాజెక్టులను చేపట్టే అవకాశాలను కూడా అన్వేషించవచ్చని చెప్పారు.

ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ (ఈసీబీసీ), స్టాండర్డ్స్ మరియు లేబులింగ్, పెర్ఫార్మ్, అచీవ్ & ట్రేడ్ (పాట్) మరియు డెమోన్స్ట్రేషన్ ప్రాజెక్ట్లు వంటి బీఈఈ పథకాలను ప్రోత్సహించడం, అమలు చేయడంలో బీఈఈకి సహాయం చేసినందుకు ఆయన అన్ని స్టేట్ డేసిగ్నేటేడ్ ఏజెన్సీలకు (ఎస్డీఏ) కృతజ్ఞతలు తెలిపారు. ఉదాహరణకు, గత కొన్ని సంవత్సరాలుగా అన్ని రాష్ట్రాల ఉమ్మడి ప్రయత్నాలు కేవలం పెర్ఫార్మ్, అచీవ్ మరియు ట్రేడ్ (పాట్) పథకం ద్వారానే రూ.40,945 కోట్ల భారీ ఇంధన ఆదా చేయడం జరిగిందన్నారు. పాట్ రెండో సైకిల్ నుండి పొదుపు పరిమాణం శ్రీలంక వంటి దేశం యొక్క మొత్తం ప్రాథమిక ఇంధన సరఫరా కంటే ఎక్కువ అని హైలైట్ చేయడానికి సందర్భోచితంగా ఉందని చెప్పారు.

కర్బన ఉద్గారాల తగ్గింపు కోసం ఇంధన పొదుపు మరియు ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలు మరియు అవగాహన రెండింటిపై రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం దృష్టి సారిస్తోందని ఏపీ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) అధికారులు అభయ్ భాక్రేకు వివరించారు. ఇంధన సామర్ధ్య లక్ష్యాలను కూడా వివరించారు. పరిశ్రమలలో పెర్ఫార్మ్, అచీవ్ మరియు ట్రేడ్ స్కీమ్ అమలు ద్వారా రాష్ట్రం ఇప్పటివరకు 1.204 మిలియన్ టన్నుల చమురు సమానమైన ఇంధనాన్ని తగ్గించిందని చెప్పారు..

2030 నాటికి 150 మిలియన్ టన్నుల చమురు సమానమైన (ఎంటీఓఈ) ఇంధనాన్ని ఆదా చేయాలనే బీఈఈ లక్ష్యం మరియు 2070 నాటికి నికర శూన్య ఉద్గారాలను సాధించాలనే భారతదేశ లక్ష్యంను చేరుకునే దిశగా వడిగా అడుగులు వేయాలని కోరారు. ముఖ్యంగా వ్యవసాయం, పరిశ్రమలు, మునిసిపల్ మరియు భవనాలు వంటి కీలక రంగాలలో వినియోగదారులకు అవగాహన కల్పించడం ద్వారా మరింత త్వరగా ఈలక్ష్యాన్ని చేరుకోవచ్చన్నారు.

ఇంధన పొదుపు మరియు ఇంధన సామర్థ్య చర్యలను స్వీకరించడం ద్వారా ఇది సాధ్యపడుతుందన్నారు. ఇంధన సామర్థ్య చర్యల ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక వ్యూహం మరియు కార్యాచరణ ప్రణాళికను అభివృద్ధి చేయాలని ఎస్డీఏలను ఆయన ఆదేశించారు. బీఈఈ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అశోక్ కుమార్, సెక్రటరీ బీఈఈ, ఆర్కే రాయ్, బీఈఈ డైరెక్టర్లు మిలింద్ డియోర్, సౌరభ్ దిద్ది, సునీల్ ఖండారే, అరిజిత్సేన్ గుప్తా, వినీతా కన్వాల్, ఎస్ కే వర్మ , పీ సమాల్ , సమీర్ పండిత తదితర బీఈఈ సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *