-అర్హతే ప్రామాణికంగా పెన్షన్లు పంపిణీ:దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి కుల, మత, రాజకీయాలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా పెన్షన్లు, సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులందరికీ అందిస్తూ వారికి ఆర్థికంగా భరోసాను అందిస్తున్నారని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. ఆదివారం నాడు తూర్పు నియోజకవర్గ పరిధిలోని మొగల్రాజపురం బోయపాటి రామకృష్ణయ్య స్కూల్ నందు 7,8,19 డివిజన్లు మరియు APSRM స్కూల్ నందు 20,21,22 డివిజన్ లకు చెందిన వైయస్సార్ పెన్షన్ వారోత్సవాలు కార్యక్రమంలో పాల్గొని ఆయా డివిజన్ లలో నూతనంగా పెన్షన్లు మంజూరు అయిన 235 మంది లబ్ధిదారులకు పెన్షన్ పుస్తకాలు, నగదును అవినాష్ అందజేశారు.ఈ సందర్భంలో అవినాష్ మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి వానికీ పెన్షన్ అందించాలన్నదే ప్రభుత్వ నిర్ణయం అన్నారు. గతంలో 39 లక్షల మందికి వెయ్యి రూపాయలు చొప్పన అందించే వారని, అదికూడా ఎండనక, వాననక క్యూలైన్లో నుంచోవలసిన పరిస్థితులు ఉండేవన్నారు. నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అర్హతే ప్రామాణికంగా తీసుకుని ప్రతి పేదవానికి పించను అందించగా, నేడు రాష్ట్రంలో 64.64 లక్షల మందికి ఫించన్లు అందిస్తూ వారికి ఆర్థిక భరోసాను కల్పించారన్నారు. ప్రభుత్వం ఇంత చేస్తుంటే ప్రతి ప్రక్షాలు పెన్షన్లు తీసేస్తారనే దుష్పప్రచారం చేయడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. గత టీడీపీ చంద్రబాబు హయాంలో కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే పెన్షన్ అందజేసేవారని, ఎన్నికలు ఆరేడు నెలలు ఉందనగా రూ.2వేలు చేశారన్నారు. కానీ వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండీ జగనన్న చెప్పినట్లు పెన్షన్ పెంచుతూ ప్రస్తుతం రూ.2,750లు అందజేస్తున్నారని అని అవినాష్ తెలిపారు. తెలుగుదేశం పార్టీ హయాంలో జన్మభూమి కమిటీలు చెప్పిన వారికి పెన్షన్ ఇచ్చేవారని, నేడు ఆ పరిస్థితి భిన్నంగా జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందచేస్తున్నామన్నారు. వాలంటీర్లు,సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేసి ఇళ్ల వద్దకే సంక్షేమ పథకాలు అందజేసి అవినీతి రహిత పాలన అందజేయడం జరుగుతుందన్నారు.ఇంతటి చక్కటి పరిపాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి చల్లని ఆశీస్సులు దీవెనలు ఎల్లవేళలా ఉండాలన్నారు.వైస్సార్సీపీ నాయకులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు అని,సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యత ఇస్తూ జనరంజకంగా పరిపాలన అందిస్తున్నారని అవినాష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాపు కార్పొరేషన్ ఛైర్మెన్ అడపా శేషు, 7వ డివిజన్ కార్పొరేటర్ మెరకనపల్లి మాధురి, 8వ డివిజన్ ఇంచార్జ్ యలమంచిలి జయ ప్రకాష్, 19వ డివిజన్ కార్పొరేటర్ రహేన నాహీద్, 21వ డివిజన్ కార్పొరేటర్ పుప్పాల కుమారి, 22వ డివిజన్ కార్పొరేటర్ తాటిపర్తి కొండారెడ్డి, కో-ఆప్షన్ మెంబెర్ సయ్యద్ అలీమ్ మరియు వైస్సార్సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News