-ప్రజా పంపిణీ వ్యవస్థ లో ఏం డి యూ యూనిట్ ను తనిఖీ చేసిన కలెక్టర్
-భూ హక్కు పత్రాల పంపిణీ త్వరిత గతిన పూర్తి చేయాలి
-దేవరపల్లి లోని బందాపురం గ్రామంలో బయో డీజిల్ బంక్ స్థల పరిశీలన
-జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్
దేవరపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ప్రజాపంపిణీ ద్వారా జరిగే నిత్యావసర సరుకుల పంపిణీ జవాబుదారీ తనం తో కూడి ఉండాలని జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం దేవరపల్లి మండలంలో దేవరపల్లి, బందాపురం గ్రామాల్లో అధికారులతో కలిసి క్షేత్ర స్థాయి లో పర్యటించి ఎమ్ డి యూ యూనిట్ ను తనిఖీ చేసి, బయో డీజిల్ బంక్ స్థల పరిశీలన చేసి, అనంతరం జి.బి. హెచ్ – జె.బి.ఆర్ నమోదు, రీ సర్వే పనులు, హక్కు పత్రాల పంపిణీ పై వి ఆర్ వో, సెక్రెటరీ లతో జాయింట్ కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జేసీ కె. తేజ్ భరత్ మాట్లాడుతూ, ప్రజా పంపిణ ద్వారా అందచేసే సరుకుల విషయంలో తూకం విషయంలో ఖచ్చితత్వం పాటించాలని అన్నారు. అనంతరం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో రీ సర్వే పనులు, వైయస్ఆర్ జగనన్న భూ రక్షా మరియు భూ హక్కు పత్రాలు పంపిణీ కి పై జేసీ గ్రామాల వారీగా సమీక్ష చేశారు. అనంతరం దేవరపల్లి లో పి వో ఎల్ ఆర్ పనులను పరిశీలించి , ఆయా పనులను వేగవంతం చేయాలని తేజ్ భరత్ ఆదేశించారు. మండల పరిధిలో ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలు, అర్భికే, మన బడి నాడు నేడు పనులకు చెందిన నిర్మాణ రంగంలోని పనులను మరింత వేగం చెయ్యాలని స్పష్టం చేశారు. నవరత్నాలు పేదలందరికి ఇళ్ల నిర్మాణాలను చేపట్టేలా లబ్దిదారుల లో అవగాహన కల్పించాలని కోరారు. , బ్యాంకుల ద్వారా అదనపు రుణాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ పర్యటన లో జేసీ ఆర్డీవో ఎస్. మల్లి బాబు, తహశీల్దార్ మాదాసు రామకృష్ణ , వి ఆర్ వో లు, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News