Breaking News

స్వామి వివేకానంద బోధనలు నేటి యువతకు స్ఫూర్తిదాయకం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వామి వివేకానంద బోధనలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు అన్నారు. స్వామి వివేకానంద 160వ జయంతి సందర్బంగా గురువారం కలెక్టరేట్లో కలెక్టర్ ఢిల్లీరావు, జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్ లు స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ యువతకు స్ఫూర్తిగా మార్గ నిర్దేశకుని గా నిలిచిన స్వామి వివేకానంద జయంతిని ప్రతీ సంవత్సరం జనవరి 12వ తేదీన జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. భారతదేశ ఖ్యాతిని, సాంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద అన్నారు. దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లోనూ ఆయన గురువు రామకృష్ణ పరమహంస పేరు మీదుగా రామకృష్ణ మిషన్, రామకృష్ణ మఠాలను స్థాపించి ఎందరో విద్యావంతులను సమాజ సేవకు అంకితం చేశారన్నారు. యువతకు స్ఫూర్తిగా, మార్గ నిర్దేశకుడిగా స్వామి వివేకానంద నిలిచారన్నారు. 1893వ సంవత్సరం సెప్టెంబర్ 11న అమెరికాలోని చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనానికి దేశ ప్రతినిధిగా స్వామి వివేకానంద హాజరై ప్రారంభ ఉపన్యాసంతో ప్రపంచ నేతలను ఆకట్టుకున్నారన్నారు. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను , హైందవ సనాతన ధర్మాన్ని విశ్వవ్యాప్తంగా చాటి చెప్పారన్నారు. భారతదేశం అద్భుతాలకు నిలయమని ఈ దేశాన్ని సందర్శిస్తే ఎన్నో విషయాలు తెలుస్తాయని విదేశీ ప్రతినిధులను ఆహ్వానించారన్నారు. స్వామి వివేకానంద సూక్తులకు ప్రభావితమై నేటికీ ఎంతోమంది తమ లక్ష్యాలను నెరవేర్చుకుంటున్నారని కలెక్టర్ ఢిల్లీరావు అన్నారు.

విజేతలను అభినందించిన కలెక్టర్:
స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో వివిధ అంశాలపై నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విజేతలను కలెక్టర్ ఢిల్లీరావు అభినందిచారు. ఈ నెల 7వ తేదీ నుండి 10వ తేదీ వరకు కెబిఎన్ కళాశాల, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన వ్యాసరచన , ఎలక్యూషన్, డిబేట్ , క్విజ్ , కబడ్డీ , వాలీబాల్ , ఖోఖో పోటీలలో గెలిపొందిన ప్రథమ , ద్వితీయ స్థానాలలో నిలిచిన విజేతలకు కలెక్టర్ ఢిల్లీరావు షీల్డ్ ప్రశంసా పత్రాలను అందచేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్, జిల్లా యువజన సంక్షేమ అధికారి యు . శ్రీనివాసరావు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *